ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్లాస్టిక్‌ రహిత పట్టణంగా తీర్చిదిద్దుతాం

ABN, First Publish Date - 2021-10-30T04:26:56+05:30

ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, కౌన్సిలర్లు, అధికారుల సహకారంతో నాయుడుపేటను ప్లాస్టిక్‌ రహిత పట్టణంగా తీర్చిదిద్దుతామని చైర్‌పర్సన్‌ కటకం దీపిక అన్నారు.

మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్న చైర్‌ పర్సన్‌ దీపిక
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చైర్‌ పర్సన్‌ దీపిక 

స్వపక్షంలోనే వాడివేడిగా చర్చలు 

నాయుడుపేట, అక్టోబరు 29 : ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, కౌన్సిలర్లు, అధికారుల సహకారంతో నాయుడుపేటను ప్లాస్టిక్‌ రహిత పట్టణంగా తీర్చిదిద్దుతామని చైర్‌పర్సన్‌ కటకం దీపిక అన్నారు. నాయుడుపేట మున్సిపాలిటీ కార్యాలయంలో శుక్రవారం కమిషనర్‌ చంద్రశేఖర్‌రెడ్డి, చైర్‌పర్సన్‌ కటకం దీపిక సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. పట్టణంలోని 25 వార్డుల్లో దాదాపు రూ. 6 కోట్లతో అభివృద్ధి పనులకు కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది.

స్వపక్షంలోనే వాడివేడిగా  చర్చలు

మున్సిపాలిటీలోని 25 వార్డుల్లో 23 వార్డుల్లో వైసీపీ కౌన్సిలర్లు ఉన్నారు. అజెండాలోని 22 అంశాలపై ఆయా కౌన్సిలర్లు ప్రశ్నలు వేస్తూ వాడివేడిగా చర్చలు కొనసాగించారు. గతంలో టెండర్లలో పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్లు చాలాపనులు చేయలేదని, అటువంటి వారు మళ్లీ టెండర్లు వేస్తున్నారని, వారికి నోటీసులు  ఇచ్చి తగు చర్యలు తీసుకోవాలని డిమండ్‌ చేశారు. అజెండాలో చూపిన అభివృద్ధి పనుల విలువతోపాటు ఆ పనులకు సంబంధించిన ప్రతి వారికి కేటాయించిన అంచనాలు కూడా తెలియజేయాలన్నారు. ప్రధానంగా లక్షలు, కోట్లు పనులు చేపడుతూ కనీస సదుపాయాలు రోడ్డు,  డ్రైనేజీ ప్యాచ్‌లకు నిఽధులు కేటాయించడం లేదని, తీవ్ర జాప్యం చేస్తున్నారని వైస్‌ చైర్మన్‌ రఫీ అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మేనేజర్‌ ఖాదర్‌మొహిద్దీన్‌, ఏఈ జానకీరామిరెడ్డి, వైస్‌చైర్మన్‌ వెంకటకృష్ణారెడ్డి, నాయకులు కటకం జయరామ్‌, కరీంబాయి చెంచయ్య, కౌన్సిలర్లు ఉన్నారు. 

Updated Date - 2021-10-30T04:26:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising