ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేజీబీవీలో అక్రమాలపై పీవో విచారణ

ABN, First Publish Date - 2021-03-08T05:26:48+05:30

స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో అక్రమాలపై సమగ్ర శిక్ష ప్రాజెక్ట్‌ పీవో పైడి వెంకటరమణ ఆదివారం విచారణ చే శారు. కేజీబీవీలో అక్రమాలు జరుగుతున్నాయంటూ జిల్లా అధికారులకు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో వారు స్పం దించి విచారణకు ఆదేశించారు.

విద్యార్థినులతో మాట్లాడుతున్న పీవో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జలుమూరు, మార్చి 7: స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో అక్రమాలపై  సమగ్ర శిక్ష  ప్రాజెక్ట్‌ పీవో పైడి వెంకటరమణ ఆదివారం విచారణ చే శారు. కేజీబీవీలో అక్రమాలు జరుగుతున్నాయంటూ జిల్లా అధికారులకు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో వారు స్పం దించి విచారణకు ఆదేశించారు.  ఈ సందర్భంగా ఆయన... విద్యార్థులను ఎస్‌వో వాన సుజాత వేధిస్తున్నట్లు వచ్చే ఫిర్యాదుపై  దర్యాప్తు నిర్వహించారు. విద్యార్థులతో మాట్లాడారు. గత ఏడాది ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు వచ్చే రూ.750 స్కాలర్‌ను నేరుగా విద్యార్థుల ఖాతాలకు  జమ చేయకుండా..  ఎస్‌వో వాన సుజాత కొన్ని పాఠ్యపుస్తకాలు కొనుగోలు చేసి విద్యార్థులకు ఇచ్చి మిగతా సొమ్మును  సొంతానికి వాడుకున్నట్టు గుర్తించారు. మిగతా సొమ్మును తక్షణమే విద్యార్థుల వ్యక్తిగత ఖాతాలకు సర్దుబాటు చేయాలని పీవోను ఆదేశించారు.  అలాగే.. ఇక్కడి అటెండర్‌ హైమావతి పిల్లలను వేధిస్తున్నట్లు దర్యాప్తులో తేలడంతో మెమో జారీచేయాలని ఎస్‌వోకు సూచించారు.  మరుగుదొడ్లు పనులు ఈనెల 15 నాటికి పనులు పూర్తి జరిగేలా  చూడాలన్నారు. ఎస్‌వో వాన సుజాతపై ఫిర్యాదులు  అధికంగా వస్తున్నందున బదిలీ చేయాలని కలెక్టర్‌కు నివేదిక సమర్పిస్తున్నట్లు పీవో తెలిపారు.  

Updated Date - 2021-03-08T05:26:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising