ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంచాయతీకో చెరువు అభివృద్ధి

ABN, First Publish Date - 2021-08-02T04:47:09+05:30

జిల్లాలో పంచాయతీకి ఒక చెరువును అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం దృష్టి సారిస్తోందని ఇందులో భాగంగా జిల్లాను పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్టు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ పేర్కొన్నారు. ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. తొలిదశగా జిల్లాలో 400 చెరువులను అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు. కాలువలకు కొత్తగా షట్టర్లు ఏర్పాటు చేయడం తో పాటు వంశధార నదిపై నేరడి బ్యారేజ్‌ పూర్తి చేస్తామన్నారు.

మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


పైలెట్‌ ప్రాజెక్టుగా జిల్లా ఎంపిక

డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ 

నరసన్నపేట, ఆగస్టు 1: జిల్లాలో పంచాయతీకి ఒక చెరువును అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం దృష్టి సారిస్తోందని ఇందులో భాగంగా జిల్లాను పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్టు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ పేర్కొన్నారు. ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. తొలిదశగా జిల్లాలో 400 చెరువులను అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు. కాలువలకు కొత్తగా షట్టర్లు ఏర్పాటు చేయడం తో  పాటు వంశధార నదిపై నేరడి బ్యారేజ్‌ పూర్తి చేస్తామన్నారు. జిల్లా రైతుల కలలను సాకారం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. నరసన్నపేట, పలాస పట్టణాల్లో రోడ్లు విస్తరణ చేపట్టి పట్టణాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. నరసన్నపేటలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కళా శాలను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఇసుకపై ప్రతిపక్ష నాయకులు చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. ఒక వైపు అభివృద్ధి మరో వైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా వారికి కనిపించకపో వడం దృరదృష్టకరమన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్‌ కరిమి రాజేశ్వర రావు, ఆరంగి మురళి, చింతు రామారావు, బెహరా అప్పన్న తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-08-02T04:47:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising