ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆక్రమణలు తొలగించాల్సిందే..

ABN, First Publish Date - 2021-07-28T05:07:25+05:30

పాత జాతీయ రహదారి, నౌపడా-మెళియాపుట్టి రోడ్డు, జడ్పీ రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలను 24 గంటల్లోగా తొలగించాల్సిందేనని సబ్‌ కలెక్టర్‌ వికాస్‌ మర్మట్‌ ఆదేశించారు. మంగళవారం ఆక్రమణల తొలగింపు ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఎవరైనా ఆక్రమణలు స్వచ్ఛందంగా తొలగించకుంటే తమ సిబ్బందే తొలగిస్తారని హెచ్చరించారు.

ఆక్రమణల తొలగింపును పరిశీలిస్తున్న సబ్‌ కలెక్టర్‌ వికాస్‌ మర్మట్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


టెక్కలి, జూలై 27: పాత జాతీయ రహదారి, నౌపడా-మెళియాపుట్టి రోడ్డు, జడ్పీ రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలను 24 గంటల్లోగా తొలగించాల్సిందేనని సబ్‌ కలెక్టర్‌ వికాస్‌ మర్మట్‌ ఆదేశించారు. మంగళవారం ఆక్రమణల తొలగింపు ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఎవరైనా ఆక్రమణలు స్వచ్ఛందంగా తొలగించకుంటే  తమ సిబ్బందే తొలగిస్తారని హెచ్చరించారు.  రోడ్ల పక్కన దుకాణాలు, బడ్డీలు, ఇతర సము దాయాలు ఏర్పాటు వల్ల వాహన చోదకులు, పాదచారులు ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. రోడ్లకు ఇరువైపులా అవసరమైన చోట మొక్కలు నాటించాలని అధికారులను ఆదేశించారు. ఆయనతో పాటు తహసీల్దార్‌ నాగభూషణరావు, ఎస్‌ఐ గోపాలరావు, పంచాయతీ కార్యదర్శి శాంతి స్వరూప్‌, సర్వేయర్‌ సుభాష్‌,  ఉన్నారు.

 

టెక్కలిపాడులో..

జలుమూరు: టెక్కలిపాడులో రోడ్డుపక్క ప్రభుత్వ స్థలాల్లోని ఆక్రమణలను మంగళవారం అధికారులు తొలగించారు.  తహసీల్దార్‌ జామి ఈశ్వరమ్మ ఆధ్వర్యంలో పోలీసుల సహకారంతో జేసీబీతో ఆక్రమణలు తొలగించారు. ప్రభుత్వ పోరంబోకు భూములు, చెరువులు, కాలువలు ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్‌ హెచ్చరించారు.  కార్యక్రమంలో  సర్వేయర్‌ చిన్నప్పన్న, తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2021-07-28T05:07:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising