ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నత్తనడక!

ABN, First Publish Date - 2021-06-17T03:57:13+05:30

జిల్లాలో 1,863 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మొత్తం సర్వే నెంబర్లు 2,42,343. భూమి విస్తీర్ణం 12,58,153.24 ఎకరాలు. తొలివిడతగా 621 గ్రామాల్లో సమగ్ర సర్వే చేయాలని నిర్ణయించారు. తొలుత గ్రామాల హద్దులను గుర్తించారు. గణాంకాల ప్రకారం గ్రామాల మధ్య ఉన్న హద్దులు పరిశీలించి రికార్డుల పరంగా ఉన్నాయో లేదో తెలుసుకుని మార్కింగ్‌ వేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. తొలుత డివిజన్‌లో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి పూర్తిస్థాయి సర్వే చేపటారు. శ్రీ

ఇచ్ఛాపురం మండలంలో సర్వే చేస్తున్న అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50




భూముల రీ సర్వేకు అడ్డంకులు

కొవిడ్‌ ప్రభావంతో నిలిచిన పనులు

గడువులోగా కష్టమేనంటున్న అధికారులు

(ఇచ్ఛాపురం రూరల్‌)

భూముల రీ సర్వేకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం భూముల రీ సర్వే ప్రక్రియ చేపడుతున్న సంగతి తెలిసిందే. అత్యాధునిక పరిజ్ఞానంతో అధికారులు గత ఏడాది డిసెంబరు 21న సర్వే ప్రారంభించారు. మండలాల్లో కొన్ని గ్రామాలను పైలెట్‌ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేశారు. కానీ ప్రక్రియకు ఎప్పటికప్పుడు అవాంతరాలు ఎదురవుతున్నాయి. 2022 అక్టోబరు నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయడం కష్టమేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

జిల్లాలో 1,863 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మొత్తం సర్వే నెంబర్లు 2,42,343. భూమి విస్తీర్ణం 12,58,153.24 ఎకరాలు. తొలివిడతగా 621 గ్రామాల్లో సమగ్ర సర్వే చేయాలని నిర్ణయించారు. తొలుత గ్రామాల హద్దులను గుర్తించారు. గణాంకాల ప్రకారం గ్రామాల మధ్య ఉన్న హద్దులు పరిశీలించి రికార్డుల పరంగా ఉన్నాయో లేదో తెలుసుకుని మార్కింగ్‌ వేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. తొలుత డివిజన్‌లో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి పూర్తిస్థాయి సర్వే చేపటారు. శ్రీకాకుళం డివిజన్‌లో సంతలక్ష్మీపురం, టెక్కలి డివిజన్‌లో ఆనందపురం, పాలకొండ డివిజన్‌లో పరశురాంపురంలో సర్వే పూర్తి చేశారు. తర్వాత మరో 38 గ్రామాల్లో చేస్తున్న సమయంలో డ్రోన్లు పాడయ్యాయి. దీంతో ఒక నెల పాటు ప్రక్రియ నిలిచిపోయింది. ఇంతలో స్థానిక సంస్థల ఎన్నికలు, తరువాత కరోనా రెండో దశ వ్యాప్తితో మరింత జాప్యమైంది. దీనికితోడు సాంకేతిక పరిజ్ఞానంపై సిబ్బందికి అవగాహన లేకపోవడంతో సర్వేలో ఆశించిన స్థాయిలో పురోగతి లేకుండా పోయింది. 

స్వచ్ఛీకరణ పూర్తయితేనే..

రీసర్వే వేగవంతంగా సాగాలంటే రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన భూస్వచ్ఛీకరణ (ఆ గ్రామానికి సంబంధించిన భూమి రికార్డులు) ప్రక్రియను ముందుగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. భూముల గణాంకాలు సక్రమంగా ఉంటే సర్వే త్వరితగతిన పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. స్వచ్ఛీకరణ పనులు ఆశించిన స్థాయిలో సాగడం లేదు. ఇప్పటివరకూ జిల్లాలో 180 గ్రామాల్లో మాత్రమే భూ రికార్డుల స్వచ్ఛీకరణ పూర్తయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. భూ సంబంధిత లెక్కలు పక్కాగా లేకుంటే మళ్లీ ఆగిపోయే అవకాశాలున్నాయని సర్వే శాఖ అధికారులు చెబుతున్నారు. సర్వేయర్లకు అధునాతన పరిజ్ఞానంపై శిక్షణ ఇచ్చారు. సర్వేకు అవసరమైన బేస్‌స్టేషన్‌లు కూడా ఏర్పాటు చేశారు. కానీ ప్రక్రియ సజావుగా ముందుకు సాగడం లేదు.


శరవేగంగా ప్రక్రియ

భూముల స్వచ్చీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం కొవిడ్‌ కారణంగా కొన్ని చోట్ల నిలిచిపోయాయి. జిల్లా వ్యాప్తంగా 180 గ్రామాల్లో పనులు పూర్తి చేశాం. ప్రభుత్వం నిర్ణయించిన గడువులోగా పథకం పనులు పూర్తి చేస్తాం. నిరంతరం పర్యవేక్షిస్తున్నాం.

- కె.ప్రభాకర్‌, సర్వే అండ్‌ లాండ్‌ రికార్డు, జిల్లా అసిస్టెంట్‌ డైరెక్టర్‌, శ్రీకాకుళం.


Updated Date - 2021-06-17T03:57:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising