ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.1800 కోట్లతో పౌష్టికాహారం

ABN, First Publish Date - 2021-10-22T04:57:57+05:30

అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా బాలింతలకు, గర్భిణులు, చిన్నారులకు అందజేసే పౌష్టికాహారానికి ప్రతి ఏటా రూ.1800 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోందని మహిళ, శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. కోమర్తి, చితమానిపేట, తలసముద్రం గ్రామాల్లో నిర్మించిన అంగన్‌వాడీ కేంద్ర భవనాలను గురువారం ప్రారంభించారు.

అంగన్‌వాడీ భవనాన్ని ప్రారంభిస్తున్న మంత్రి వనిత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహిళ, శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత 

నరసన్నపేట/పోలాకి, అక్టోబరు 21: అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా బాలింతలకు, గర్భిణులు, చిన్నారులకు అందజేసే పౌష్టికాహారానికి ప్రతి ఏటా రూ.1800 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోందని మహిళ, శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. కోమర్తి, చితమానిపేట, తలసముద్రం గ్రామాల్లో నిర్మించిన అంగన్‌వాడీ కేంద్ర భవనాలను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో అంగన్‌వాడీ కేంద్రాలను విలీనం చేసి మరింత బలోపేతం చేసేందుకు నిధులు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. పిల్లలు ఆరోగ్యంగా ఉండా లనే ఉద్దేశంతో నాణ్యమైన పౌష్టికాహారాన్ని సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని చంద్ర బాబు నాయుడు తన రాజకీయ స్వలాభం కోసం కుయుక్తులకు పన్ను తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ పిరియా విజయ, వైసీపీ నాయకులు కిల్లి కృపారాణి, ధర్మాన కృష్ణ చైతన్య, ఐసీడీఎస్‌ ఆర్జేడీ చిన్మయిదేవి, ప్రాజెక్టు డైరెక్టర్‌ జయదేవి, పీవో నాగరాణి తదితరులు పాల్గొన్నారు.  

 

Updated Date - 2021-10-22T04:57:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising