ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వదిలేస్తే...అంతే!

ABN, First Publish Date - 2021-09-01T05:03:20+05:30

సామాజిక పింఛన్ల పంపిణీ విధానంలో ప్రభుత్వం నూతన మార్పులు తీసుకొచ్చింది. ఇక నుంచి ఏ నెలకు ఆ నెల పింఛన్లను లబ్ధిదారులు తీసుకోవాలి. రెండు, మూడు నెలలకు ఒకసారి తీసుకుంటామంటే కుదరదు. బుధవారం నుంచి సెప్టెంబరు నెలకు సంబంధించి పింఛన్ల పంపిణీ ప్రారంభంకానున్న నేపథ్యంలో సచివాలయ వెల్ఫేర్‌ అసిస్టెంట్లకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసినట్టు తెలుస్తోంది.

లబ్ధిదారుడికి పింఛన్‌ అందిస్తున్న వలంటీరు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50




 పింఛన్లకు కొత్త నిబంధనలు

ఇకపై నెల నెలా తీసుకోవాల్సిందే

మరుసటి నెల తీసుకునే అవకాశం ఉండదు 

(టెక్కలి రూరల్‌)

సామాజిక పింఛన్ల పంపిణీ విధానంలో ప్రభుత్వం నూతన మార్పులు తీసుకొచ్చింది. ఇక నుంచి ఏ నెలకు ఆ నెల పింఛన్లను లబ్ధిదారులు తీసుకోవాలి. రెండు, మూడు నెలలకు ఒకసారి తీసుకుంటామంటే కుదరదు. బుధవారం నుంచి సెప్టెంబరు నెలకు సంబంధించి పింఛన్ల పంపిణీ ప్రారంభంకానున్న నేపథ్యంలో సచివాలయ వెల్ఫేర్‌ అసిస్టెంట్లకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసినట్టు తెలుస్తోంది. వలంటీర్లకు మౌఖిక ఆదేశాలు వచ్చినట్టు సమాచారం. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఆగస్టు నెల పింఛను బకాయిలు సెప్టెంబరు నెలలో మంజూరు కాలేదు. దీంతో ఆగస్టులో పింఛను తీసుకోకపోయిన వారిలో ఆందోళన నెలకొంది. అదే సమయంలో లబ్ధిదారులకు ఏంచెప్పాలో సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లకు తెలియడం లేదు.  తాజా ఆదేశాలు కేవలం సామాజిక మాధ్యమాల ద్వారా రావడం గమనార్హం. జిల్లాలో ఆగస్టు నెలకు సంబంధించి అన్ని సామాజిక పింఛన్లు 3,74,145 మంజూరయ్యాయి. వివిధ కారణాలతో 13,140 మంది లబ్ధిదారులు పింఛన్‌ తీసుకోలేదు. సెప్టెంబరు నెల పింఛన్‌లో ఆగస్టు బకాయిలు జత కాలేదు. దీంతో గ్రామాల్లో నిలదీతలు తప్పవని సచివాలయ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. దీనికితోడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగుల కుటుంబాల్లో లబ్ధిదారులకు సైతం ఈ నెల పింఛను నిలిచిపోనుందని సమాచారం. 

- జిల్లాలో 1,81,886 వృద్ధాప్య, 1,29,639 వితంతు, 35,150 వికలాంగ, 5,046 నేతన్న, 1,478 మంది కల్లు గీత కార్మికులకు పింఛన్లు అందుతున్నాయి. 12,974  మంది ఒంటరి మహిళలు, 4,231 మంది మత్స్యకారులకు, 567 మంది కళాకారులు, 1649 డప్పు కళాకారులు, 89 ట్రాన్స్‌జెండర్లకు పింఛన్లు అందుతున్నాయి.  సెప్టెంబరు నెలకు సంబంధించి 3,67,918 మంది లబ్ధిదారులకు రూ.84.61 కోట్లు మంజూరయ్యాయి. గత నెల బకాయిలు జత చేయకపోగా..ఈ నెల పోర్టబులిటీ ద్వారా ఇతర ప్రాంతాల్లో సైతం పింఛను తీసుకునే వెసులుబాటును నిలిపివేసినట్టు తెలుస్తోంది. 





Updated Date - 2021-09-01T05:03:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising