ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బడివానిపేటలో ఇరువర్గాల కొట్లాట

ABN, First Publish Date - 2021-04-11T05:33:57+05:30

బడివాని పేట గ్రామంలో శుక్రవారం రాత్రి ఇరువర్గాల మధ్య కొట్లాట జరిగింది.

గాయపడిన ఉప్పాడ నారాయణమ్మ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 పదిమందికి గాయాలు 

ఎచ్చెర్ల, ఏప్రిల్‌ 10:  బడివాని పేట గ్రామంలో శుక్రవారం రాత్రి ఇరువర్గాల మధ్య కొట్లాట జరిగింది. ఈ ఘటనలో పదిమంది గాయప డ్డారు. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక ఎన్ని కలు జరిగిన నాటినుంచి గ్రామంలో ఇరువర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలకు సమీప గ్రామమైన నిమ్మవానిపేటలో చేపల అమ్మకం విషయంలో మాటమాటా పెరిగింది.  ఇది ఇరువర్గాల మధ్య కొట్లాటకు దారితీసింది. ఇళ్లల్లోకి చొచ్చుకుపోయి, కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ  ఘటనలో ఇరువర్గాలకు చెందిన ఉప్పాడ నారాయణమ్మ, మధు, వారధి అప్పయ్యమ్మ, ఎల్లమ్మ, వాసు, అల్లుపల్లి రాము, వాసుపల్లి అప్పన్న, కారి నీలం, సూరాడ చంటి, కారి శైలజలు గాయపడ్డారు. వీరిలో తీవ్రంగా గాయపడిన వ్యక్తులు శ్రీకాకుళం సర్వజనాసుపత్రిలో చేరగా, మిగిలిన వారు స్థానికంగానే చికిత్స పొందుతున్నారు. సమాచారం తెలిసిన వెంటనే శ్రీకాకుళం డీఎస్పీ మాతా మహేంద్ర, జేఆర్‌పురం సీఐ చంద్రశేఖర్‌, ఎచ్చెర్ల ఎస్‌ఐ జి.రాజేష్‌, ప్రత్యేక పోలీసు బలగాలతో గ్రామానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. గ్రామంలో పోలీసు పికెట్‌ను ఏర్పాటు చేశారు.  


 

 


Updated Date - 2021-04-11T05:33:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising