ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మావల్ల కాదు బాబోయ్‌!

ABN, First Publish Date - 2021-02-25T05:24:32+05:30

ఇంటింటికీ రేషన్‌ పంపిణీ మా వల్ల కాదని, ఈ బాధ్యతలు నిర్వర్తించలేమని మొబైల్‌ రేషన్‌ వాహనాల ఆపరేటర్లు తేల్చిచెప్పారు. ఈ మేరకు శ్రీకాకుళం టౌన్‌, గార మండలాలకు చెందిన ఆపరేటర్లు బుధవారం జేసీ సుమిత్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందించారు.

జేసీ వద్ద మొరపెడుతున్న రేషన్‌ పంపిణీ వాహన ఆపరేటర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


- రేషన్‌ పంపిణీ బాధ్యతలు నిర్వర్తించలేం

- జేసీకి వాహనాల ఆపరేటర్ల మొర

కలెక్టరేట్‌, ఫిబ్రవరి 24: ఇంటింటికీ రేషన్‌ పంపిణీ మా వల్ల కాదని, ఈ బాధ్యతలు నిర్వర్తించలేమని మొబైల్‌ రేషన్‌ వాహనాల ఆపరేటర్లు తేల్చిచెప్పారు. ఈ మేరకు శ్రీకాకుళం టౌన్‌, గార మండలాలకు చెందిన ఆపరేటర్లు బుధవారం జేసీ సుమిత్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇంటింటికీ రేషన్‌ పంపిణీకి తమ ఆర్థిక, ఆరోగ్య పరిస్థితి సహకరించడం లేదన్నారు. గ్రామ వలంటీర్లు కూడా సహకరించడం లేదని,  అన్ని పనులు తామే చూసుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యతలు భారంగా ఉన్నందున రేషన్‌ పంపిణీ చేపట్టలేమని చెప్పారు. దీనిపై జేసీ స్పందిస్తూ.. మీకు ఏ సమస్య వచ్చినా తనకు ఫోన్‌ చేసి మాట్లాడాలని సూచించారు.  తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని, మీ సమస్యలను  ప్రభుత్వం పరిష్కస్తుందన్నారు. కొత్త పథకం ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయని, సివిల్‌ సప్లై కమిషనర్‌తో మాట్లాడి వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. రేషన్‌ అందించడంలో జిల్లాలో శ్రీకాకుళం అర్బన్‌ మొదటి స్థానంలో ఉందని ఆపరేటర్లను అభినందించారు. వినతిపత్రం అందించిన వారిలో ఆపరేటర్లు ఆర్‌.సూర్యనారాయణ, నరేష్‌, జి.వెంకటరమణ, రాజా, ఈశ్వర్‌, షేర్‌ఖాన్‌, అప్పారావు, సంతోష్‌, తదితరులు ఉన్నారు.  

Updated Date - 2021-02-25T05:24:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising