ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గంజాయి అక్రమ రవాణా

ABN, First Publish Date - 2021-08-02T04:01:19+05:30

గంజాయి అక్రమ రవాణా

తనిఖీలో దొరికిన 120కేజీల గంజాయి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- లక్ష్మీపురం టోల్‌గేట్‌ సమీపంలో 120 కేజీల నిల్వలు స్వాధీనం

పలాస, ఆగస్టు 1 : లక్ష్మీపురం టోల్‌గేట్‌ సమీపంలో 120 కేజీల గంజాయి నిల్వలు పోలీసులకు పట్టుబడ్డాయి. ఇందుకు సంబంధించి కాశీబుగ్గ సీఐ శంకరరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఇచ్ఛాపురం నుంచి విశాఖపట్నం జిల్లా పాడేరు ఏజెన్సీ ప్రాంతానికి కొంతమంది వ్యాన్‌లో కోళ్లు తీసుకెళ్లి అక్కడ అన్‌లోడ్‌ చేస్తారు. అనంతరం పాడేరులో గంజాయి నిల్వలు లోడ్‌ చేసి..  ఇచ్ఛాపురం వైపు అక్రమ రవాణా సాగిస్తుంటారు. బీహార్‌, పంజాబ్‌ రాష్ట్రాలకు ఈ గంజాయిని తరలిస్తున్నారు. ఈ సమాచారం ముందస్తుగా తెలియడంతో లక్ష్మీపురం టోల్‌గేట్‌ వద్ద పోలీసులు ఆదివారం వాహనాలు తనిఖీచేశారు. విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీ ప్రాంతం నుంచి కోళ్లవ్యాన్‌లో 120 కేజీల గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నారు.  బీహార్‌కు చెందిన సంజిత్‌సింగ్‌, పంజాబ్‌కు చెందిన కాకాసింగ్‌తో పాటు సంతోష్‌కుమార్‌ వ్యాన్‌లో గంజాయిని కనిపించకుండా దాచిపెట్టారు. తనిఖీల్లో పోలీసులు గంజాయిని గుర్తించారు. సంజిత్‌సింగ్‌, కాకాసింగ్‌లను అదుపులోకి తీసుకున్నారు. సంతోష్‌కుమార్‌ పరారీలో ఉన్నాడు. ఈ ఘటనపై తహసీల్దార్‌ ఎల్‌.మధుసూదనరావు సమక్షంలో కేసు నమోదు చేశారు. తనిఖీలో ఆర్‌ఐ రవికుమార్‌, వీఆర్వో అప్పలస్వామి, పోలీసు సిబ్బంది ఉన్నారు. 

 

Updated Date - 2021-08-02T04:01:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising