ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

77 మందికి కొవిడ్‌ పరీక్షలు

ABN, First Publish Date - 2021-06-14T04:41:16+05:30

మండలంలో ఆదివారం 77 మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. జలుమూరు పీహెచ్‌సీలో 40 మందికి, అచ్యుతాపురం పీహెచ్‌సీ 27 మందికి, సైరిగాం పీహెచ్‌సీలో 10 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్యాధికారులు శ్రీకాంత్‌, సునీత, గురునాథరావు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జలుమూరు: మండలంలో ఆదివారం 77 మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. జలుమూరు పీహెచ్‌సీలో 40 మందికి, అచ్యుతాపురం పీహెచ్‌సీ 27 మందికి, సైరిగాం పీహెచ్‌సీలో 10 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్యాధికారులు శ్రీకాంత్‌, సునీత, గురునాథరావు తెలిపారు. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలుంటే సమీపంలోని పీహెచ్‌సీకి వెళ్లి పరీక్షలు చేయించుకుని వైద్య సేవలు పొందాలన్నారు. 


రేగిడిలో నలుగురికి పాజిటివ్‌

రేగిడి: మండలంలో రెండు గ్రామాల్లో ఆదివారం నలుగురికి పాజిటివ్‌ నమోదైనట్లు తహసీల్దార్‌ బి.సత్యం తెలిపారు. ఒకే గ్రామంలో ముగ్గురికి వైరస్‌ లక్షణాలు కనిపించడంతో ఈ గ్రామంలో ప్రత్యేకంగా అప్రమత్తం చేశామన్నారు. 


పాతపట్నంలో 11..

మెళియాపుట్టి (పాతపట్నం): పాతపట్నం మండలంలో 11 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు తహసీల్దార్‌ ఎం.కాళీప్రసాద్‌ తెలిపారు. అలాగే 18 మంది జ్వర పీడితులను గుర్తించి వైద్యసేవలందించే చర్య లు తీసుకున్నామన్నారు. 



 ఎల్‌ఎన్‌పేటలో ఏడుగురికి..

ఎల్‌.ఎన్‌.పేట: మండలంలోని వివిధ గ్రామాల్లో ఏడుగురికి కరోనా పాజిటివ్‌ ఆదివారం నిర్ధారణ అయినట్లు తహసీల్దార్‌ బీఎస్‌ ఎస్‌ సత్యనారాయణ, ఎంపీడీవో ఆర్‌.కాళీప్రసాద రావు  తెలిపారు. వీరిలో ఒకరిని పాతృనివలస క్వారంటైన్‌ కేంద్రానికి పంపించి మిగిలిన ఆరుగురికి హోమ్‌ ఐసొలేషన్‌లో ఉంచేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. సోమవారం తురకపేట, కృష్ణా పురం, బొర్రంపేట, పెద్దకోట-1, 2 గ్రామ సచివాలయాల్లో 45 ఏళ్లు పైబడిన వారికి, ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులకు వ్యాక్సిన్‌ వేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. 


నేడు వ్యాక్సినేషన్‌

 రాజాం: కరోనా నేపథ్యంలో ఐదేళ్ల పిల్లల తల్లులకు, 45 ఏళ్లు దాటిన వారికి సోమవారం వ్యాక్సిన్‌ వేయనున్నట్లు  కొవిడ్‌ వైద్యుడు ఆకిరి భార్గవ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆదర్శనగర్‌, కొండంపేట, ఆర్‌అండ్‌బీ బంగ్లా, మిత్తిరెడ్డి వీధి, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, బుచ్చింపేట సచివాలయం, లచ్చయ్యపేట స్కూల్‌లో కొవిషీల్డ్‌ వేయడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.



Updated Date - 2021-06-14T04:41:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising