ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం

ABN, First Publish Date - 2021-01-14T05:14:51+05:30

వైసీపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకటరావు ఒక ప్రకటనలో విమర్శించారు.

భోగి మంటల వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్న వామపక్షపార్టీల నాయకులు, కార్యకర్తలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కళావెంకటరావు  

ఎచ్చెర్ల: వైసీపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకటరావు ఒక ప్రకటనలో విమర్శించారు. సంక్రాంతి పండగ నాడు కూడా రైతులు సంతోషంగా లేరన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి ఇప్పటి వరకు డబ్బులు కూడా చెల్లించలేదన్నారు. తోటపల్లి ప్రాజెక్ట్‌ ద్వారా సాగునీటిని సక్రమంగా అందజేయలేదన్నారు. ఉత్తరాంధ్రలో పంటల్లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నట్టు చెప్పారు. ఒక్క ఛాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. 


రైతు వ్యతిరేక జీవోలు దహనం

 రైతు వ్యతిరేక జీవోలను టీడీపీ మండల అధ్యక్షుడు బెండు మల్లేశ్వరరావు తన స్వగ్రామం ముద్దాడలో బుధవారం భోగి మంటల్లో వేసి దహనం చేశారు. ఇలాంటి జీవోల వల్ల రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. 

పాలకొండ: రైతు వ్యతిరేక జీవోలను రైతు సంఘాల ఆధ్వర్యంలో బుధవారం భోగి మంటల్లో వేసి దహనం చేశారు.  ఎల్‌ఎల్‌పురం, వీపీరాజుపేట, బాసూరు, రుద్రిపేట, వెలగవాడ, సింగన్నవలస, కొండాపురం, డొంకలపర్త, బూర్జ మండలంలో అల్లెన,వై.పర్త తదితర గ్రామాల్లో రైతు వ్యతిరేక  చట్టాల జీవో కాపీలు భోగి మంటలలో వేసి నిరసన తెలిపా రు. కార్యక్రమంలో రైతు సంఘ నాయకులు బుడితి అప్పలనా యుడు, గురిబిల్లి అప్పలనాయుడు, ద్వారపూడి అప్పలనా యుడు పాల్గొన్నారు.

గుజరాతీపేట: స్థానిక బాహర్‌ సాహెబ్‌పేట రామమందిరం వద్ద బుధవారం వేకువజామున వేసిన భోగి మంటల్లో ఆస్తిపన్ను జీవోలు, రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టం కాపీలను వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు దహనం చేశారు. కార్యక్రమంలో సనపల నర్సింహులు, తాండ్రప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-01-14T05:14:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising