ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోస్టుమార్టం గది ఇలాగేనా?

ABN, First Publish Date - 2021-01-19T05:38:38+05:30

ఇచ్ఛాపురం సీహెచ్‌సీలోని పోస్టుమార్టం గది నిర్వహణపై ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం సీహెచ్‌సీని సందర్శించిన ఆయన పోస్టుమార్టం గదిని పరిశీలించారు.

తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేస్తున్న ఎమ్మెల్యే అశోక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కనీస వసతులు లేకపోవడంపై ఎమ్మెల్యే అశోక్‌ ఆగ్రహం 

ఇచ్ఛాపురం, జనవరి 18 : ఇచ్ఛాపురం సీహెచ్‌సీలోని పోస్టుమార్టం గది నిర్వహణపై  ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం సీహెచ్‌సీని సందర్శించిన ఆయన పోస్టుమార్టం గదిని పరిశీలించారు. అక్కడ విద్యుత్‌, తాగునీరు తదితర సదుపాయం లేకపోవడంపై వైద్యులను ప్రశ్నించారు. రాజకీయ నేతల ఒత్తిళ్లకు తలొగ్గకుండా తక్షణమే ఆసుపత్రి ఆభివృద్ధి కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రూ.5 కోట్లతో నిర్మించిన అధునాతన ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. వేసిన రోడ్డు కూడా ఇంతవరకు ప్రారంభించలేదు. రెండు రోజుల్లో వచ్చి రోడ్డును ప్రారంభిస్తానని చెప్పారు. ఆసుపత్రిలోని సమస్యలపై కలెక్టర్‌కు నివేదించనున్నట్ట తెలిపారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సాలిన ఢిల్లీ, మాజీ ఎంపీపీ ఢిల్లీరావు, కాళ్ల ధర్మారావు, జిల్లా పార్లమెంటరీ ప్రధానకార్యదర్శి ఆశి లీలారాణి, ఎన్‌.జానీ, ఎన్‌.కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఆధార్‌ కేంద్రం ప్రారంభించాలని వినతి...

ఇచ్ఛాపురంలో ఆధార్‌ నమోదు కేంద్రాన్ని ప్రారంభించాలని ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ తహసీల్దార్‌ బి.మురళీమోహన్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ ఆధార్‌ నమోదు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారని, ఇతర ప్రాంతాలకు చిన్నారులు, వృద్ధులు వెళ్తేందుకు అవస్థలు ఇబ్బందులకు గురవుతున్నారని తహసీల్దార్‌ దృష్టికి తీసుకువెళ్లారు.   

Updated Date - 2021-01-19T05:38:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising