ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉప్పొంగిన నాగావళి

ABN, First Publish Date - 2021-09-29T05:44:15+05:30

ఒడిశాలో కురిసిన వర్షాలకు వేగావతి, సువరముఖి నదుల్లో నీరు గణనీయంగా రావడంతో మడ్డువలస రిజర్వాయర్‌ నీటిమట్టం గణనీయంగా పెరిగింది. మంగళ వారం ఉదయం వర కు నిలకడగా ఉన్న ఇన్‌ఫ్లో ఒక్కసారిగా పెరగడంతో రిజర్వాయర్‌ అధికారులు అప్రత్తమయ్యారు. 5 గేట్లు ఎత్తి 51 వేల క్యూసెక్కుల నీటిని నాగావళి నదిలోకి విడుదల చేశారు.

మడ్డువలస రిజర్వాయర్‌ నుంచి విడుదల చేస్తున్న నీరు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వంగర: ఒడిశాలో కురిసిన వర్షాలకు వేగావతి, సువరముఖి నదుల్లో నీరు గణనీయంగా రావడంతో  మడ్డువలస రిజర్వాయర్‌ నీటిమట్టం గణనీయంగా పెరిగింది. మంగళ వారం ఉదయం వరకు నిలకడగా ఉన్న ఇన్‌ఫ్లో ఒక్కసారిగా పెరగడంతో రిజర్వాయర్‌ అధికారులు అప్రత్తమయ్యారు. 5 గేట్లు ఎత్తి 51 వేల క్యూసెక్కుల నీటిని నాగావళి నదిలోకి విడుదల చేశారు. రిజర్వాయర్‌ పూర్తిస్థాయి నీటి మట్టం 64.50 మీటర్లు కాగా ప్రస్తుతం 63.50  మీటర్లు ఉంది. ఎగువనుంచి నీరు వచ్చి చేరుతున్న నేపథం్యంలో రిజర్వాయర్‌ను పూర్తిగా ఖాళీ చేయాలని కలెక్టర్‌, ఉన్నతాధికారులు ఆదేశాలివ్వడంతో ఆ దిశగా చర్యలు చేపడుతున్నారు. 


తగ్గుతున్న వరద ఉధృతి

హిరమండలం: వంశధార నదిలో వరద ఉధృతి తగ్గింది. క్యాచ్‌మెంట్‌ ఏరియాలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో నదిలో ఇన్‌ఫ్లో క్రమేపీ తగ్గుతోంది మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు గొట్టా బ్యారేజి వద్దకు 22,732 కూసెక్కులు ఇన్‌ఫ్లో వచ్చింది. వచ్చిన నీటినంతా 22 గేట్లు పైకెత్తి కిందకు విడిచి పెడుతున్నట్లు డీఈఈ ప్రభాకర్‌ చెప్పారు. కాగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా ఎదుర్కొనేం దుకు ముందు జాగ్రత్తగా ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధం చేశారు. వీరు జిల్లోడిపేట వద్ద మహేంద్ర తనయ నది, గొట్టా బ్యారేజి వద్ద వంధార వరద పరిస్థితిని పరిశీలించారు. వీరితో పాటు ఆర్‌ ఐ సునీల్‌కుమార్‌ ఉన్నారు.

 

Updated Date - 2021-09-29T05:44:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising