ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్రమంగా కేసులు పెడితే సహించం

ABN, First Publish Date - 2021-11-22T05:15:12+05:30

ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపిస్తున్న ప్రతిపక్ష టీడీపీ నేతలపై పోలీసులతో అక్రమంగా కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేస్తోందని, దీన్ని సహించేది లేదని, బదులు తీర్చుకుంటామని పలువురు టీడీపీ నేతలు హెచ్చరించారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి వజ్జ బాబూరావు, జిల్లా కార్యదర్శి పీరుకట్ల విఠల్‌రావు, పార్లమెంటరీ పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి గాలి కృష్ణారావు, సీనియర్‌ నాయకుడు లొడగల కామేశ్వరరావు యాదవ్‌ విలేఖరులతో మాట్లాడారు.

కొవొత్తులతో నిరసన తెలియజేస్తున్న టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


 టీడీపీ నాయకుల హెచ్చరిక

  కాశీబుగ్గలో కొవ్వొత్తులతో నిరసన

పలాస/కాశీబుగ్గ, నవంబరు 21: ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపిస్తున్న ప్రతిపక్ష టీడీపీ నేతలపై పోలీసులతో అక్రమంగా కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేస్తోందని, దీన్ని సహించేది లేదని, బదులు తీర్చుకుంటామని పలువురు టీడీపీ నేతలు హెచ్చరించారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి వజ్జ బాబూరావు, జిల్లా కార్యదర్శి పీరుకట్ల విఠల్‌రావు, పార్లమెంటరీ పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి గాలి కృష్ణారావు, సీనియర్‌ నాయకుడు లొడగల కామేశ్వరరావు యాదవ్‌ విలేఖరులతో మాట్లాడారు. రాష్ట్రంలో భయానక వాతావరణం నెలకొందని, బీహార్‌ రాష్ట్రం కన్నా రౌడీలు రెచ్చి పోతున్నారన్నారు. తమ పార్టీ నేత కూన రవి కుమార్‌ ను అర్ధరాత్రి దాటిన తరువాత అరెస్ట్‌ చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. అసెంబ్లీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులపై ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తూ వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు. ప్రజా క్షేత్రంలో వారికి బుద్ధి చెప్పక తప్పదని హెచ్చరించారు. కాశీబుగ్గ ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద టీడీపీ నేతలు, కార్యకర్తలు కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. కార్యక్రమంలో గురిటి సూర్యనారాయణ, బడ్డ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 

  

Updated Date - 2021-11-22T05:15:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising