ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పచ్చని చెట్లపై వేటు!

ABN, First Publish Date - 2021-09-17T04:58:51+05:30

పచ్చని చెట్లను సంర క్షించాలని ప్రభుత్వం సూచి స్తోంది. కానీ ఎల్‌ఎన్‌పేట మండలం తాయిమాంబ పురం ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతోంది.

యంత్రాలతో చెట్లు తొలగిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


(ఎల్‌ఎన్‌పేట)

పచ్చని చెట్లను సంర క్షించాలని ప్రభుత్వం సూచి స్తోంది. కానీ ఎల్‌ఎన్‌పేట మండలం తాయిమాంబ పురం ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతోంది. పారిశుధ్య పనుల పేరుతో పచ్చని మొక్కలు, చెట్లను తొలగించడం విమర్శలకు తావిస్తోంది. వంశధార ఫేజ్‌-2 రిజ ర్వాయర్‌ నిర్మాణంలో భాగంగా నిర్వాసితులుగా మారిన గార్లపాడు నిర్వాసితులకు తాయి మాంబాపురం వద్ద పునరావాస కాలనీ ఏర్పాటుచేశారు. దాదాపు వెయ్యి కుటుంబాలకు ఇక్కడ ఇళ్ల స్థలాలు కేటాయించారు. నాటి నుంచి ఆయా గ్రామాల ప్రజలు రోడ్డుకిరువైపులా పచ్చని మొక్కలు నాటారు. నివాసాల వెంబడి మామిడి, జామి, కొబ్బరి, సీతాఫలం మొక్కలు నాటారు. అవి చెట్లుగా మారి ఫలసాయాన్ని ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో పారిశుధ్యం పేరిట పంచాయతీ అధికారులు వాటిని యంత్రాలతో తొలగిస్తున్నారు. దీనిపై గ్రామస్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఒకవైపు చెట్లను సంరక్షించాలని చెబుతుంటే..ఇలా తొలగించడం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే జంగిల్‌ క్లీయరెన్స్‌ చేపట్టాలని..కానీ తొలగింపు నిర్ణయం తగదంటూ పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్‌లపై గ్రామస్థులు ఎంపీడీవో కాళీప్రసాదరావుకు ఫిర్యాదుచేశారు. తక్షణం తొలగించే పనులను నిలుపుదల చేయాలని జి.గోవిందరావు, బి.లక్ష్మీనారాయణ, రామకృష్ణ, అప్పలనాయుడు, అప్పారావు, మనోజ్‌లు డిమాండ్‌ చేశారు. 



Updated Date - 2021-09-17T04:58:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising