ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధిష్ఠానాన్ని ధిక్కరిస్తే వేటు తప్పదు

ABN, First Publish Date - 2021-02-27T05:44:09+05:30

రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో అధిష్ఠానం నిర్ణయాన్ని ధిక్కరించిన వారిపై వేటు తప్పదని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ హెచ్చరించారు. శుక్రవారం బల్లిపుట్టుగ గ్రామంలో డీసీఎంఎస్‌ చైర్మన్‌ పి.సాయిరాజ్‌ నివాసంలో ఇచ్ఛాపురం మున్సిపాలిటీ నాయకులతో సమావేశం నిర్వహించారు.

మాట్లాడుతున్న కృష్ణదాస్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌

కవిటి, ఫిబ్రవరి 26 : రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో అధిష్ఠానం నిర్ణయాన్ని ధిక్కరించిన వారిపై వేటు తప్పదని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ హెచ్చరించారు. శుక్రవారం బల్లిపుట్టుగ గ్రామంలో డీసీఎంఎస్‌ చైర్మన్‌ పి.సాయిరాజ్‌ నివాసంలో ఇచ్ఛాపురం మున్సిపాలిటీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో శతశాతం విజయం సాధించాలని పార్టీ అఽభ్యర్థుల గెలుపునకు నాయకులంతా సమన్వయంతో పనిచేయాలని దిశానిర్ధేశం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రెబల్స్‌, పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి శతశాతం విజయానికి కృషి చేయాలన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నరేష్‌ కుమార్‌ (లల్లూ), వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఎన్‌.రామారావు, మాజీ చైర్‌పర్సన్‌ పిలక రాజ్యలక్ష్మి, తులసీదాస్‌, లాభాల స్వర్ణమణి తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-02-27T05:44:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising