హిందూపురం మెము రైలు రద్దు
ABN, First Publish Date - 2021-10-21T17:11:36+05:30
యలహంక-పెనుకొండ విభాగంలో జంట రైలు మార్గాల పనులు సాగుతున్న నేపథ్యంలో హిందూపురం మెము రైలును 46 రోజులపాటు రద్దు చేస్తున్నట్లు నైరుతి రైల్వే ప్రకటించింది. హిందూపురం - దేవురపల్లి మార్గంలో
బెంగళూరు(Karnataka): యలహంక-పెనుకొండ విభాగంలో జంట రైలు మార్గాల పనులు సాగుతున్న నేపథ్యంలో హిందూపురం మెము రైలును 46 రోజులపాటు రద్దు చేస్తున్నట్లు నైరుతి రైల్వే ప్రకటించింది. హిందూపురం - దేవురపల్లి మార్గంలో నిర్మాణ పనులు సాగుతున్నందున రానున్న నెలన్నర రోజుల పాటు మెము రైలు సంచారం ఉండదని బుధవారం విడుదల చేసిన ప్రకటన తెలిపింది. యశ్వంతపుర - హిందూపురం మధ్య సంచరించే ఈ మెము రైలు నిరుపేదలు, సామాన్యులకు ఎంతో అనుకూలంగా ఉండేది. యశ్వంతపురం నుంచి సాయంత్రం 6.10 గంటలకు బయల్దేరి హిందూపురానికి చేరుకొని రాత్రి అక్కడే హాల్ట్ అయి మరుసటి రోజు ఉదయం 9.30 గంటలకు బయల్దేరి యశ్వంతపురంనకు చేరుకొనేది. ప్రయాణ చార్జీ కేవలం 25 రూపాయలే కావడంతో చిన్న వ్యాపారులు సరుకుల కొనుగోళ్ల కోసం నిత్యం ఈ రైలుపై ఆధారపడేవారు. నెలన్నర పాటు రైలు సంచారానికి బ్రేక్ పడడంతో ఇప్పుడు బస్సుల్లో వంద రూపాయల చార్జీ చెల్లించి వెళ్ళాల్సి వస్తోందని ప్రయాణికులు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా పనులు ముగించి మళ్లీ ఈ రైలును పునరుద్దరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Updated Date - 2021-10-21T17:11:36+05:30 IST