ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ ప్రచారం బూటకం

ABN, First Publish Date - 2021-12-06T05:11:05+05:30

రాష్ట్ర ప్రభుత్వం ‘రెండో ఏటా ఇచ్చిన మాటకు పెద్దపీట’ అంటూ చేస్తున్న ప్రచారం పెద్ద బూటక మని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ మూర్తి విమర్శించారు. మాతలలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు.

గోపి కుటుంబ సభ్యులతో మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


 ఒక్క పథకం ఇచ్చి.. మిగిలినవీ ఇచ్చినట్లు పుస్తకంలో నమోదు

 మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి

కొత్తూరు, డిసెంబరు 5: రాష్ట్ర ప్రభుత్వం ‘రెండో ఏటా ఇచ్చిన మాటకు పెద్దపీట’ అంటూ చేస్తున్న ప్రచారం పెద్ద బూటక మని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ మూర్తి విమర్శించారు.  మాతలలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. మాతల గ్రామానికి చెందిన కలమట గోపి అనే వ్యక్తి ఇంటికి సంక్షేమ సంత కం-2 పేరుతో పుస్తకాన్ని అందించారన్నారు. అయితే ఆ పుస్తకం తెరిచి ఆ కుటుంబ సభ్యులు విస్తుపోయారన్నారు. ప్రభుత్వం నుం చి రూ.1,02,274 లబ్ధి పొందినట్లు అందులో నమోదు చేశారని, అయితే అమ్మఒడి రూ.29 వేలు మాత్రమే వచ్చాయని వారు తెలిపారన్నారు. మిగిలిన మొత్తంలో ఆరోగ్య ఆసరా కింద రూ.8,375, రూ.64,430 వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లబ్ధిపొందినట్లు తప్పుడుగా పొందుపరిచారన్నారు. మొత్తం రూ.1,02,274 లో రూ.29 వేలు ఇచ్చి మిగిలిన రూ.72,805 ఎవరి అకౌంట్‌ వేశారో సీఎం జగన్‌, అధికారులు తెలపాలని కలమట డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ అందిస్తున్న తప్పుడు సమాచారం, ప్రచారాన్ని ప్రజల్లోకి బలంగా  తీసుకువెళ్లాలని పేర్కొన్నారు.

 

Updated Date - 2021-12-06T05:11:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising