ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవం.. మహాసౌరహోమం

ABN, First Publish Date - 2021-01-24T05:35:47+05:30

అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో శనివారం మహాసౌరహోమం వైభవంగా ప్రారంభమైంది. లోక కల్యాణం కోసం తలపెట్టిన ఈ మహాక్రతువు 13 రోజుల పాటు నిర్విరామంగా జరగనుంది. తొలిరోజు ఉదయం 6 గంటలకు అరసవల్లిలో తిరువీధి నిర్వహించారు.

సౌరహోమం నిర్వహిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రారంభమైన మహాక్రతువు

 13 రోజుల పాటు నిర్వహణ

భక్తులకు అనుమతి లేదు

గుజరాతీపేట, జనవరి 23: అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో శనివారం మహాసౌరహోమం వైభవంగా ప్రారంభమైంది. లోక కల్యాణం కోసం తలపెట్టిన ఈ మహాక్రతువు 13 రోజుల పాటు నిర్విరామంగా జరగనుంది. తొలిరోజు ఉదయం 6 గంటలకు అరసవల్లిలో తిరువీధి నిర్వహించారు. 9.21 గంటలకు కలశస్థాపనతో మహాక్రతువు సంకల్పం ప్రారంభించారు. తర్వాత విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, పరిషత్ర్పాయశ్చిత్తం, కృచ్ఛ్రత్చయంలు చేపట్టారు. మధ్యాహ్నం 3.30 గంటలకు  365 మట్టి శివలింగాలకు 24 మంది రుత్వికులు అర్చన చేశారు. ప్రధాన యాగశాలలో నవగ్రహాలకు పూజలు చేశారు. శ్రీచక్ర నవావరణార్చన, త్రిచ, మహాసౌర, సూర్యనమస్కారాలను ప్రత్యేకంగా నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా సాయంత్రం ప్రముఖ నృత్యకళాకారిణి నీరజాసుబ్రహ్మణ్యం శిష్యబృందం ఆధ్వర్యంలో నృత్య ప్రదర్శన,  సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో భజన నిర్వహించారు.  ప్రతిరోజు సాయంత్రం భజన కార్యక్రమం ఉంటుందని సత్యసాయి సేవాసంస్థల ఉపాధ్యక్షుడు ఆర్‌.లక్ష్మణరావు తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకరశర్మ పర్యవేక్షణలో మహాసౌరహోమం జరుగుతోంది. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఈ క్రతువు నిర్వహిస్తున్నామని, భక్తులకు అనుమతిలేదని ఈవో హరిసూర్యప్రకాష్‌ తెలిపారు.

Updated Date - 2021-01-24T05:35:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising