ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా ప్రపంచ ధరిత్రీ దినోత్సవం

ABN, First Publish Date - 2021-04-23T05:20:02+05:30

ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌-2 ఆధ్వర్యంలో గురువారం ప్రపంచ ధరిత్రీ దినోత్సవాన్ని నిర్వహించారు. ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు చెత్తను సేకరించి, పిచ్చి మొక్కలను తొలగించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ టి.గోవిందమ్మ, ఎన్‌ఎస్‌ఎస్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ విజయే శ్వరరావు పాల్గొ న్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టెక్కలి, ఏప్రిల్‌ 22: ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌-2 ఆధ్వర్యంలో గురువారం  ప్రపంచ ధరిత్రీ దినోత్సవాన్ని నిర్వహించారు. ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు చెత్తను సేకరించి, పిచ్చి మొక్కలను తొలగించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ టి.గోవిందమ్మ, ఎన్‌ఎస్‌ఎస్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ విజయే శ్వరరావు పాల్గొ న్నారు. అలాగే అర్థశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో మార్కెట్‌ వర్గీకరణ, సంపూర్ణ పోటీ మార్కె ట్‌పై డాక్టర్‌ బి.ప్రభాకరరావు ప్రధాన ప్రసంగం చేశారు.  కార్యక్రమంలోపలువురు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. 


వాతావరణ మార్పుల వల్లే వ్యాధులు 

వజ్రపుకొత్తూరు:  వాతావరణంలో వచ్చిన మార్పులు వల్ల కరోనా వంటి వ్యాధు లు వస్తున్నాయని  వెంకటాపురం పీహెచ్‌సీ వైద్యుడు జోగి గౌతం తెలిపారు. గురు వారం శివసాగర్‌ బీచ్‌లో ధరిత్రి దినోత్సవం పురస్కరించుకొని గ్రీన్‌ఆర్మీ అధ్యక్షుడు బి.గోపాల్‌ ఆధ్వర్యంలో తీరంలోని ప్లాస్టిక్‌ వస్తువులు, చెత్త, గాజు సీసాలు ఏరి  శుభ్రం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మధు, ఓంకార్‌, ధుర్యోధన పాల్గొన్నారు. 


భూ పరిరక్షణతో మానవ మనుగడ

పాతపట్నం: భూ పరిరక్షణతోనే మానవ మనుగడ ముడిపడి ఉందని బ్రెడ్స్‌ సంస్థ పీవో  సాంబమూర్తి అన్నారు. స్థానిక సంస్థ కార్యాలయంలో ప్రపంచ ధరిత్రీ దినోత్సవాన్ని గురువారం నిర్వహించారు. వసుధ సంస్థ పీవో పాణిగ్రాహి మాట్లా డుతూ ప్లాస్టిక్‌ వస్తువుల నిషేధం, సేంద్రియ ఎరువుల  వినియోగాను వివరించారు. కార్యక్రమంలో పలువురు స్థానిక రైతులు, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

 

Updated Date - 2021-04-23T05:20:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising