ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు సమస్యలపై పోరాటాలకు సిద్ధంకండి

ABN, First Publish Date - 2021-10-18T04:54:59+05:30

రైతు సమస్యలపై పోరాటాలకు టీడీపీ శ్రేణులు సిద్ధం కావాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. నిమ్మాడలో ఆయన క్యాంపు కా ర్యాలయంలో తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతా ల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు.

అచ్చెన్నాయుడుతో మాట్లాడుతున్న తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


 టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

కోటబొమ్మాళి, అక్టోబరు 17:  రైతు సమస్యలపై పోరాటాలకు టీడీపీ శ్రేణులు సిద్ధం కావాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. నిమ్మాడలో ఆయన క్యాంపు కా ర్యాలయంలో తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతా ల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వంపై పోరాటం చేయాలని కోరారు. దీనిలో ప్రజలను భాగస్వాములను చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఆయనతో పాటు తెలుగు రైతు జిల్లా అధ్యక్షుడు జల్లు చంద్రమౌళి, టీడీపీ నేత చౌదరి నారాయణ మూర్తి  ఉన్నారు.


అచ్చెన్నాయుడును కలిసిన బీసీ నేతలు

 టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడును ఆదివారం నిమ్మాడలోని ఆయన క్యాంపు కార్యాలయంలో పలువురు నేతలు మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలు విన్నవించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి  డాక్టర్‌  దాసరి శ్యామ్‌ చంద్ర శేషు, బీసీ నాయ కుడు కొండపల్లి రవి, హరిబాబు ఆయనను కలిసి వైసీపీ ప్రభుత్వం వల్ల బీసీలు తీవ్రంగా నష్టపోయారని, గ్రామాల్లో బీసీలపై దాడులు చేస్తున్నారని, వీటిని అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. 

 

Updated Date - 2021-10-18T04:54:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising