ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెవెన్యూ అధికారుల సహకారంతో..

ABN, First Publish Date - 2021-05-11T04:17:43+05:30

వజ్రపుకొత్తూరు మండలం రాజాం గ్రామంలో కరోనా లక్షణాలతో ఓ వృద్ధుడు (56) సోమవారం మృతిచెందాడు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. అంత్యక్రియలు నిర్వహించేందుకు గ్రామస్థులు ఎవరూ సహకరించలేదు.

వృద్ధుడి మృతదేహాన్ని శ్మశానికి తరలిస్తున్న రెవెన్యూ అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



- వజ్రపుకొత్తూరులో వృద్ధుడికి అంత్యక్రియలు

వజ్రపుకొత్తూరు : వజ్రపుకొత్తూరు మండలం రాజాం గ్రామంలో కరోనా లక్షణాలతో ఓ వృద్ధుడు (56) సోమవారం మృతిచెందాడు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. అంత్యక్రియలు నిర్వహించేందుకు గ్రామస్థులు ఎవరూ సహకరించలేదు. విషయం తెలుసుకున్న తహసీల్దార్‌ అప్పలస్వామి.. ఆర్‌ఐ కిరణ్‌కుమార్‌కు సమాచారం అందజేశారు. వెంటనే ఆర్‌ఐ ఆ గ్రామానికి చేరుకుని.. స్థానిక పెద్దలతో మాట్లాడారు. అయినా అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. చేసేదిలేక పలాస మునిసిపాలిటీ నుంచి నలుగురు వ్యక్తులను రప్పించారు. వీఆర్వో గీతాంజలి, జూనియర్‌ అసిస్టెంట్‌ నిఖిల్‌తో కలసి అంత్యక్రియలు నిర్వహించారు. ఇలా ఆపద వేళ.. ఇరుగుపొరుగు వాళ్ల సాయం కూడా లేకపోవడంతో కరోనా మృతుల కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో రెవెన్యూ అధికారులు, పారిశుధ్య సిబ్బంది ముందుకొచ్చి తమ సేవలు అందిస్తున్నారు. కరోనా బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. 



Updated Date - 2021-05-11T04:17:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising