ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాతో మరో ఐదుగురి మృతి

ABN, First Publish Date - 2021-06-17T04:02:53+05:30

కరోనా బారిన పడి బుధవారం మరో ఐదుగురు మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. దీంతో జిల్లాలో మృతుల సంఖ్య 679కి చేరింది. బుధవారం 6,098 మందికి కరోనా పరీక్షలు చేయగా, 405 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. కరోనా పాజిటివ్‌ బాధితుల సంఖ్య 1,15,825కు చేరింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



శ్రీకాకుళం, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): కరోనా బారిన పడి బుధవారం మరో ఐదుగురు మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. దీంతో జిల్లాలో మృతుల సంఖ్య 679కి చేరింది. బుధవారం 6,098 మందికి కరోనా పరీక్షలు చేయగా, 405 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. కరోనా పాజిటివ్‌ బాధితుల సంఖ్య 1,15,825కు చేరింది. వీరిలో చాలామంది కోలుకున్నారు. తాజాగా బుధవారం 381 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 4,455 ఉన్నాయి. హోం ఐసోలేషన్‌లో 3,705  మంది, కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో 250 మంది, కొవిడ్‌ ఆస్పత్రుల్లో 500 మంది చికిత్స పొందుతున్నారు. పాజిటివ్‌ కేసులు తగ్గుతున్నా, మరణాలు తగ్గకపోవడంపై ప్రజలతో పాటు అధికారుల్లోనూ అలజడి రేపుతోంది. ప్రతి ఒక్కరూ నిబంధనలు తప్పనిసరిగా పాటించి.. కరోనా కట్టడికి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.  


బ్లాక్‌ఫంగస్‌తో మహిళ మృతి

మందస మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ (55) బ్లాక్‌ఫంగస్‌తో బాధపడుతూ మంగళవారం రాత్రి మృతిచెందింది. పెందుర్తిలో ఎన్‌ఏపీగా విధులు నిర్వహిస్తున్న ఆమె గతంలో కరోనా బారినపడి.. రాగోలులోని జెమ్స్‌లో చికిత్స పొందారు. కొద్దిరోజుల తర్వాత ఆమెలో బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలు బయటపడడంతో విశాఖపట్నంలోని కేజీహెచ్‌కు తరలించారు. సుమారు 40 రోజులు అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు.  



Updated Date - 2021-06-17T04:02:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising