ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొబ్బరి రైతుకు నిరాశే

ABN, First Publish Date - 2021-10-17T05:37:40+05:30

పండగల వేళ.. కొబ్బరి రైతులకు తీవ్ర నిరాశే ఎదురవుతోంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇతర రాష్ట్రాలకు కొబ్బరికాయల ఎగుమతులు భారీగా నిలిచిపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. దసరా, దీపావళి పండగలు సమీపిస్తున్నా.. కొబ్బరి మార్కెట్‌ ఆశించిన మేర పెరగకపోవడంతో రైతులు దిగులు చెందుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- కలసిరాని పండగలు

- దసరాకూ పెరగని ధర

- ఇతర రాష్ట్రాలకు నిలిచిన ఎగుమతులు

(ఇచ్ఛాపురం రూరల్‌)

పండగల వేళ.. కొబ్బరి రైతులకు తీవ్ర నిరాశే ఎదురవుతోంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇతర రాష్ట్రాలకు కొబ్బరికాయల ఎగుమతులు భారీగా నిలిచిపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. దసరా, దీపావళి పండగలు సమీపిస్తున్నా.. కొబ్బరి మార్కెట్‌ ఆశించిన మేర పెరగకపోవడంతో రైతులు దిగులు చెందుతున్నారు. జిల్లాలో ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట తదితర మండలాల్లో సుమారు 12.4 వేల హెక్టార్లలో కొబ్బరి సాగవుతోంది. కొబ్బరిపంటపై తుఫానుల ప్రభావం, తెల్లదోమ, ఎర్రనల్లి వంటి తెగుళ్ల కారణంగా దిగుబడులు తగ్గాయి. జిల్లా నుంచి ప్రతి నెల 70 నుంచి 100 లారీలకు పైగా కొబ్బరికాయలు ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, కేరళ, బీహార్‌ తదితర రాష్ట్రాలకు ఎగుమతి అయ్యేవి. ప్రస్తుతం కరోనా ప్రభావంతో ఇతర రాష్ట్రాల నుంచి సరైన ఆర్డర్లు లేకపోవడంతో రోజుకు 30 నుంచి 40 లోడులు (లారీలు) మాత్రమే ఎగుమతి అవుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఎగుమతులు పెద్దగా లేకపోవడంతో రైతులు ఆశించిన మేర మార్కెట్‌ పుంజుకోవడం లేదు. ఏటా దసరా, దీపావళి పండగలు వచ్చాయంటే.. కొబ్బరి ధరలు పెరిగేవి. కానీ ఈ ఏడాది ఆ పరిస్థితి లేదు. దిగుబడులు లేక.. కాయలు ఎగుమతి లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. వెయ్యి పచ్చికాయలకు రూ.10,900 నుంచి రూ.11,150 మధ్య ధర పలుకుతోంది. ముక్కుడుకాయ కూడా రూ.11,200 వరకు ధర ఉంది. మొదటి రకం క్వింటాల్‌ రూ.11,500, రెండోరకం రూ.10,500 ధర పలుకుతోంది. కురిడీ కొబ్బరి పాతరకం వెయ్యింటికి రూ.14 వేలు, రెండో రకం రూ.13 వేలు ఉంది. పండగలకు కూడా పెద్దగా వినియోగించే పరిస్థితి లేకపోవడంతో ఎగుమతులు స్తంభించిపోయి ధరలు పెరగడం లేదని రైతులు వాపోతున్నారు.  


రైతులకు నష్టమే 

కొబ్బరికాయలకు దసరా, దీపావళి పండగల్లో ధరలు పెరిగేవి. ప్రస్తుతం పండగల సమయంలో ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు తగ్గడంతో కొబ్బరి రైతులు చాలా వరకు నష్టపోతున్నారు. ఈ ప్రాంతంలో కొబ్బరి ఆధారిత పరిశ్రమలు నెలకొల్పితే రైతులకు ప్రయోజనం కలుగుతుంది.

- నీలాపు.గోపి, కొబ్బరిరైతు సంఘం అధ్యక్షులు, సన్యాసిపుట్టుగ


Updated Date - 2021-10-17T05:37:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising