ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళా హోంగార్డు ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-07-24T05:58:08+05:30

మహిళా హోంగార్డు ఆత్మహత్య

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, జూలై 23: జిల్లాలో మరో హోంగార్డు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళంలో ఏపీహెచ్‌బీ కాలనీలో నివాసముంటున్న దుంపా వెంకటలక్ష్మి(30) జిల్లా పోలీసు కార్యాలయంలో హోం గార్డుగా విధులు నిర్వహిస్తోంది. తల్లి 2014లో మరణించింది. తండ్రి నరసింహ మూర్తి వద్దనే వెంకటలక్ష్మి ఉంటోంది. ఈమె అక్కచెల్లెలకు వివాహాలు కాగా.. వెంక టలక్ష్మికి మాత్రం కాలేదు. గైనిక్‌ సమస్యలతో వెంకటలక్ష్మి బాధపడుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం పేలు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కడుపునొప్పిని భరించలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు రాసి ఉన్న లేఖ తండ్రికి ఇంట్లో లభ్యమైంది.  వెంకటలక్ష్మిని హుటాహుటిన ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో  చేర్పించారు. పరిస్థితి విషమించి మృతిచెందింది. తండ్రి ఫిర్యాదు మేరకు ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా జిల్లా ఎస్పీ బంగ్లాలో పనిచేస్తున్న రెడ్డి అనే హోంగార్డ్‌ కొద్దిరోజుల క్రితం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చికిత్సపొందుతూ మూడురోజుల కిందట మృ తి చెందాడు.  తాజాగా వెంకటలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడం ఆందోళన కలిగిస్తుంది. 


వ్యక్తిగత సమస్యలతో ఒకరు..

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి : వ్యక్తిగత సమస్యలతో శ్రీకాకుళం నగరంలో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు ఇలాఉన్నాయి. వాంబేకాలనీలో మూడో బ్లాక్‌లో రత్నాకర్‌ పాణిగ్రహి కుటుంబంతో నివిసిస్తున్నాడు. రత్నాకర్‌ భవన నిర్మాణ పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల భార్య, పిల్లలతో కలిసి కొరసవాడ గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. కొద్దిరోజుల క్రితం రత్నాకర్‌ శ్రీకాకుళంలోని ఇంటికి చేరుకున్నాడు. అప్పటి నుంచి ఇంటి తలుపులు తెరవకపోవడంతో సమీప బ్లాక్‌లో నివసిస్తున్న రత్నాకర్‌ సోదరుడు గుర్తించి కిటికీ తలుపు తెరిచి చూశాడు. రత్నాకర్‌ ఉరివేసుకుని ఉండడాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించాడు. ఒకటోపట్టణ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం రిమ్స్‌కు తరలించారు. రత్నాకర్‌ వ్యక్తిగత సమస్యలు, ఆర్థికపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. దీనిపై ఎస్‌ఐ విజయ కుమార్‌ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. 

 

Updated Date - 2021-07-24T05:58:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising