ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుమార్తెను దిగబెట్టి వస్తుండగా..

ABN, First Publish Date - 2021-06-15T05:16:21+05:30

కుమార్తెను అత్తవారింటి దగ్గర దించి బైక్‌పై వస్తుండగా వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఘటనాస్థలంలోనే మృతిచెందాడు. ఈ ఘటన పిండ్రువాడ కాలనీ సమీపంలో ఆదివారం జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



 బైక్‌ అదుపు తప్పి వ్యక్తి దుర్మరణం

 పిండ్రువాడ కాలనీ సమీపంలో ఘటన 

హిరమండలం: కుమార్తెను అత్తవారింటి దగ్గర దించి బైక్‌పై వస్తుండగా వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఘటనాస్థలంలోనే మృతిచెందాడు. ఈ ఘటన పిండ్రువాడ కాలనీ సమీపంలో ఆదివారం జరిగింది. ఇందుకు సంబంధిం చి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఎల్‌ఎన్‌పేట మండలం దబ్బపాడుకు చెందిన రావాడ లక్ష్మణరావు (60) బైక్‌పై వస్తుండగా అదుపు తప్పి బోల్తాపడడం తో తలపై తీవ్రగాయాలయ్యాయి. అపస్మారకస్థితికి చేరుకున్నాడు. స్థానికులు గమనించేసరికి మృతిచెందాడు. కుమార్తెను అత్తవారి గ్రామమైన టెక్కలి మండలం చింతలగారకు దిగబెట్టి వస్తుండగా ఈ ఘటన జరిగింది. మృతుడికి భార్య భారతి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాతపట్నం సీహెచ్‌సీకి తరలించారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ కె.మధుసూధనరావు తెలిపారు. 



Updated Date - 2021-06-15T05:16:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising