ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈకేవైసీ పాట్లు!

ABN, First Publish Date - 2021-09-17T05:01:40+05:30

రాత్రి వరకూ పడిగాపులు కాస్తున్న వీరు స్వయం సహాయక సంఘాల సభ్యులు. ఈకేవైసీ చేయించేందుకు ఇలా ఆపసోపాలు పడుతున్నారు. రెండో విడత రుణ మాఫీకి సంబంధించి ప్రతిఒక్కరూ ఈకేవైసీ చేయించు కోవాల్సిందేనంటూ ప్రభుత్వం తేల్చిచెప్పింది.

పడిగాపులు కాస్తున్న స్వయం సహాయక సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



రాజాం: రాత్రి వరకూ పడిగాపులు కాస్తున్న వీరు స్వయం సహాయక సంఘాల సభ్యులు. ఈకేవైసీ చేయించేందుకు ఇలా ఆపసోపాలు పడుతున్నారు. రెండో విడత రుణ మాఫీకి సంబంధించి ప్రతిఒక్కరూ ఈకేవైసీ చేయించు కోవాల్సిందేనంటూ ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఇందుకు రెండు రోజులే గడువు ఇచ్చింది. శుక్రవారం సాయంత్రంతో చేయించుకోవాలని సూచించింది. దీంతో మహిళలు క్యూకడు తున్నారు. రాజాం మునిసిపాల్టీలో 850 స్వయం సహాయక సంఘాల్లో 9 వేల మంది సభ్యులు ఉన్నారు. గురువారం సాయంత్రం నాటికి 300 గ్రూపు సభ్యుల ఈకేవైసీ మాత్రమే పూర్తయ్యింది. ఒక్కరోజు గడువు మాత్రమే ఉంది. మిగతా 600 గ్రూపు సభ్యు లకు పూర్తిచేయాల్సి ఉంది. ఒక్కరోజులో ఇది సాధ్యమేనా అన్న వ్యాఖ్యలు వినిపిస్తు న్నాయి. దీనికితోడు సర్వర్‌ సమస్య వెంటాడుతోంది. ఇవేవీ పట్టించుకోకుండా ప్రభుత్వం మూడు రోజులే గడువు ఇవ్వడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గడువు పెంచాలని కోరుతున్నారు. దీనిపై టీఎంసీ వీకే రత్నం వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా 35 శాతం మందికి ఈకేవైసీ పూర్తయినట్టు తెలిపారు. పూర్తిస్థాయిలో చేపడతామని.. సభ్యులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. 



Updated Date - 2021-09-17T05:01:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising