ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమస్యల పరిష్కారానికి కృషి

ABN, First Publish Date - 2021-06-24T05:01:17+05:30

ఆర్టీసీ కార్మికులు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఏపీఎస్‌ ఆర్టీసీ వైస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ద్వారకా తిరుమలరావు హామీ ఇచ్చారు. బుధవారం తొలిసారిగా ఆయన జిల్లా పర్యటనకు విచ్చేశారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం కాంప్లెక్స్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిపో మేనేజర్లను సత్కరించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో మెరుగైన సేవలు అందించిన డిపో మేనేజర్లు, ఆర్టీసీ కార్మికులను ప్రశంసించారు.

మాట్లాడుతున్న ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమలరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- కొవిడ్‌ వ్యాప్తి సమయంలోనూ మెరుగైన సేవలు

-  ఆర్టీసీ ఎమ్‌డీ ద్వారకా తిరుమలరావు

గుజరాతీపేట, జూన్‌ 23: ఆర్టీసీ కార్మికులు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఏపీఎస్‌ ఆర్టీసీ వైస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ద్వారకా తిరుమలరావు హామీ ఇచ్చారు. బుధవారం తొలిసారిగా ఆయన జిల్లా పర్యటనకు విచ్చేశారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం కాంప్లెక్స్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిపో మేనేజర్లను సత్కరించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో మెరుగైన సేవలు అందించిన డిపో మేనేజర్లు, ఆర్టీసీ కార్మికులను ప్రశంసించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,  ఆర్టీసీ సిబ్బంది, కార్మికులలో ఆత్మస్ధైర్యాన్ని నింపేందుకు డిపోలను సందర్శిస్తున్నట్టు తెలిపారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రయాణికులకు సేవలందిస్తూ.. సంస్థ పురోభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఆపరేషన్స్‌ ఈడీ బ్రహ్మానందరెడ్డి, ఈడీ రవికుమార్‌, ఆర్‌ఎం అప్పలరాజు, 1, 2 డిపోల మేనేజర్లు ప్రవీణ, కవిత, డీఎస్పీలు మహేంద్ర, ప్రసాదరావు, యూనియన్‌ నాయకులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా,  ఏపీఎస్‌ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావును కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌, ఎస్పీ అమిత్‌బర్దర్‌లు మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. 

Updated Date - 2021-06-24T05:01:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising