ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దసరా సందడి

ABN, First Publish Date - 2021-10-15T04:30:38+05:30

జిల్లా అంతటా దసరా సందడి నెలకొంది. విజయదశమిని పురస్కరించుకుని గురువారం మార్కెట్‌ కిటకిటలాడింది. శ్రీకా కుళంలో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. టీవీలు, ఫ్రిజ్‌లు, ద్విచక్ర వాహనాలు తదితర కొత్తవస్తువులతో పాటు బంగారు ఆభరణాలు, వస్ర్తాల కొనుగోలుదారులతో షాపులన్నీ కళకళలాడాయి. జిల్లావ్యాప్తంగా సుమారు రూ.100కోట్లకుపై వ్యాపారం సాగింది.

శ్రీకాకుళం : కిటకిటలాడుతున్న పొట్టిశ్రీరాముల మార్కెట్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 రూ.100కోట్లకుపైగా వ్యాపారం

 కిటకిటలాడిన మార్కెట్‌

(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి)

జిల్లా అంతటా దసరా సందడి నెలకొంది. విజయదశమిని పురస్కరించుకుని గురువారం మార్కెట్‌ కిటకిటలాడింది. శ్రీకా కుళంలో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. టీవీలు, ఫ్రిజ్‌లు, ద్విచక్ర వాహనాలు తదితర కొత్తవస్తువులతో పాటు బంగారు ఆభరణాలు, వస్ర్తాల కొనుగోలుదారులతో షాపులన్నీ కళకళలాడాయి. జిల్లావ్యాప్తంగా సుమారు రూ.100కోట్లకుపై వ్యాపారం సాగింది. పండ్లు, పూజా సామగ్రి కొనుగోలుదారులతో మార్కెట్‌ రద్దీగా కనిపించింది. పూల ధరలకు రెక్కలొచ్చాయి. 50 గ్రాముల చామంతి, గులాబీ, లిల్లీ పూలు రూ.50కు తక్కువ లేకుండా విక్రయించారు. కొబ్బరికాయ కూడా ఒక్కొక్కటి రూ.30 చొప్పున, నిమ్మకాయలు కేజీ రూ.80 చొప్పున విక్రయించారు. ధరలు పెరిగినా.. తప్పని పరిస్థితుల్లో ప్రజలు కొనుగోలు చేశారు. ఇదిలా ఉండగా, ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన వారంతా స్వగ్రామాలకు చేరుకున్నారు. రైళ్లు, ప్రైవేటు బస్సులు, ఇతర ట్రావెల్స్‌ ప్రయాణికులతో కిటకిటలాడాయి. గార, ఎచ్చెర్ల, రణస్థలం, వజ్రపుకొత్తూరు, పోలాకి, టెక్కలి, పలాస ప్రాంతాల్లో బస్సులు, ఆటోలు కిక్కిరిసిపోతున్నాయి.  

Updated Date - 2021-10-15T04:30:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising