ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అట్రాసిటీ కేసుపై డీఎస్పీ దర్యాప్తు

ABN, First Publish Date - 2021-04-13T05:17:17+05:30

గురవాంలో ఈనెల 10న జరిగిన కొట్లాటలో నమోదైన అట్రాసిటీ కేసుకు సంబంధించి శ్రీకాకుళం ఎస్సీ,ఎస్టీ సెల్‌-1 డీఎస్పీ కె.బాలరాజు సోమవారం రాత్రి విచారణ చేపట్టారు.

క్షతగాత్రుల నుంచి వివరాలు సేకరిస్తున్న డీఎస్పీ బాలరాజు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజాం రూరల్‌ : గురవాంలో ఈనెల 10న జరిగిన కొట్లాటలో నమోదైన  అట్రాసిటీ కేసుకు సంబంధించి శ్రీకాకుళం ఎస్సీ,ఎస్టీ సెల్‌-1 డీఎస్పీ కె.బాలరాజు సోమవారం రాత్రి విచారణ చేపట్టారు. ఈ మేరకు రాజాం సామాజిక ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులతో మాట్లాడి ఘటనకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. గురవాంలో ఈనెల 10న అర్ధరాత్రి దాటినయు  తర్వాత రెండు సామాజిక వర్గాల మధ్య కొట్లాట జరిగిన విషయం విదితమే. ఈ నేపథఽ్యంలో ఒక సామాజిక వర్గానికి చెందిన చందక బాబ్జీ తదితరులు తమను కులం పేరుతో దూషించి, గాయపరిచినట్లు మరో సామాజిక వర్గానికి చెందిన కె.గోపి తదితరులు రాజాం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ రేవతి కేసు నమోదు చేయగా ఈ మేరకు సామాజిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గోపి తదితరుల నుంచి డీఎస్పీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. 


Updated Date - 2021-04-13T05:17:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising