ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిటిజన్‌ ఔట్‌ రీచ్‌ సర్వేపై అశ్రద్ధ వద్దు

ABN, First Publish Date - 2021-10-30T05:13:22+05:30

సిటిజన్‌ ఔట్‌ రీచ్‌ సర్వేపై అశ్రద్ధ వహించవద్దని ఐటీడీఏ పీవో బి.నవ్య ఆదేశించారు. శుక్రవారం చాపర సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సర్వేజాప్యంపై సిబ్బందిని ప్రశ్నించగా నెట్‌వర్క్‌ సరిగా లేదని సమాధానమిచ్చారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

చాపర సచివాయాన్ని తనిఖీ చేస్తున్న ఐటీడీఏ పీవో నవ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐటీడీఏ పీవో నవ్య

మెళియాపుట్టి: సిటిజన్‌ ఔట్‌ రీచ్‌ సర్వేపై అశ్రద్ధ వహించవద్దని ఐటీడీఏ పీవో బి.నవ్య ఆదేశించారు. శుక్రవారం చాపర సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సర్వేజాప్యంపై సిబ్బందిని ప్రశ్నించగా నెట్‌వర్క్‌ సరిగా లేదని సమాధానమిచ్చారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సచివాలయ సిబ్బంది సకాలంలో హాజరుకావాలి, కొవిడ్‌ వ్యాక్సినేషన్‌పై బాధ్య త వహించాలని సూచించారు. అనంతరం చాపర పీహెచ్‌సీ, ఏకలవ్య పాఠశాలల్లో చేపడుతున్న పనులను పరిశీలించి ఇంజినీరింగ్‌ సిబ్బందికి సూచనలిచ్చారు. పీహెచ్‌సీకి తాగునీటి ఇబ్బంది ఉందని వైద్యాధికారి జి.గణపతిరావు తెలిపారు. ఆమెతో పాటు డీటీ ప్రసాదరావు, ఆర్‌ఐ హరిబాబు, ఏపీఎం లలిత తదితరులున్నారు.

 

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

హరిపురం : విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఐటీడీఏ పీవో బి.నవ్య హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం మండలంలో వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలను పరిశీలించారు. కిల్లోయి ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం కొండలోగాం సచి వాలయాన్ని పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీడీవో వి.తిరుమల రావు, ఏఈ తవిటయ్య తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2021-10-30T05:13:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising