ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా లక్షణాలుంటే ఉపేక్షించొద్దు

ABN, First Publish Date - 2021-05-18T04:53:07+05:30

ఫీవర్‌ సర్వేలో కాని, ప్రైమరీ కాంటాక్టులో కరోనా పాజిటివ్‌ వచ్చే వారు వైద్య పరీక్షలకు నిరాకరిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించవద్దని, అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పాల కొండ ఆర్డీవో టీవీజీఎస్‌ కుమార్‌ ఆదేశించారు.

రేగిడి: సమీక్షిస్తున్న పాలకొండ ఆర్డీవో కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలకొండ ఆర్డీవో కుమార్‌ 
రేగిడి, మే 17: ఫీవర్‌ సర్వేలో కాని, ప్రైమరీ కాంటాక్టులో కరోనా పాజిటివ్‌ వచ్చే వారు వైద్య పరీక్షలకు నిరాకరిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించవద్దని, అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పాల కొండ ఆర్డీవో టీవీజీఎస్‌ కుమార్‌ ఆదేశించారు. మండల కాంప్లెక్స్‌లో సోమవారం కరోనాపై వివిధ శాఖల అధికారులు, సర్వేలైన్స్‌ సిబ్బందితో సమీక్షించారు. బూరాడ పీహెచ్‌సీ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి కరోనా లక్షణాలున్నా పరీక్షకు రాలేదని వైద్యాధికారి సీతారాం ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీనికి స్పందిస్తూ..  ఎటువంటి వారైనా తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. మండలంలో కరోనా పరీక్షల్లో వెనుకబడి ఉండడంపై సిబ్బందిని ప్రశ్నించారు. సమావేశంలో మండల ప్రత్యేకాధికారి శ్రీనివాసరావు, తహసీల్దార్‌ సత్యం, ఎంపీడీవో స్టిఫెన్‌సన్‌, వైద్యాధికారి పార్థసారధి తదితరులు పాల్గొన్నారు. మండలంలో తొమ్మిది గ్రామాల్లో సోమవారం 16మందికి పాజిటివ్‌ నమోదైనట్లు తహసీల్దార్‌ బి. సత్యం తెలిపారు. ఈ గ్రామాలను అప్రమత్తం చేసినట్లు చెప్పారు.

Updated Date - 2021-05-18T04:53:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising