ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనవసరంగా రోడ్లపైకి రావద్దు

ABN, First Publish Date - 2021-05-12T05:13:25+05:30

కర్ఫ్యూ సమయంలో అకారణంగా రోడ్లపై తిరుగు తున్న యువకులను పోలీసులు పట్టుకొని కౌనెల్సింగ్‌ ఇస్తున్నారు.

పాలకొండ: ప్లకార్డులతో అవగాహన కల్పిస్తున్న పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 వాహనదారులకు పోలీసుల కౌన్సెలింగ్‌ 

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి: కర్ఫ్యూ సమయంలో అకారణంగా రోడ్లపై తిరుగు తున్న యువకులను పోలీసులు పట్టుకొని కౌనెల్సింగ్‌ ఇస్తున్నారు. మంగళవా రం మధ్యాహ్నం సూర్యమహల్‌ జంక్షన్‌ వద్ద కొంతమంది యువకులు ద్విచక్ర వాహనాలతో తిరుగుతుండడంతో ఒకటోపట్టణ సీఐ అంబేద్కర్‌ గమనించి  వారిని ప్రశ్నించారు.  సరైన కారణం  చెప్పకపోవడంతో వారికి కౌన్సెలింగ్‌ ఇ చ్చారు. కరోనా వేళ అజాగ్రత్తగా ఉంటే ఎటువంటి సమస్యలు వస్తాయో తెలిసేలా ఆ యువకులతో ప్లకార్డులను ప్రదర్శించారు. మరోసారి అనవస రంగా రోడ్లపైకి వస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించి యువకులను విడిచిపెట్టారు.  ఆమదాలవలస: కరోనా నుంచి మనల్ని మనమే కాపాడుకోవాలని  పోలీసులు పిలుపునిచ్చారు.  మంగళవారం ఆమదాలవలసలో తహసీల్దార్‌ జి.శ్రీనివాసరావు, సీఐ బి.ప్రసాదరావు, ఎస్‌ఐ ఎ.కోటేశ్వరరావు ఆధర్యంలో పర్య టించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ కర్ఫ్యూ సమయంలో అనవసరంగా ఎవరూ రోడ్లపైకి రావద్దని, నిబంధనలు పాటించాలని కోరారు.  ఇచ్ఛాపురం:పురుషోత్తపురం చెక్‌పోస్టులో ఏర్పాటుచేసిన తనిఖీకేంద్రం వద్ద ఒడిశా నుంచి వస్తున్న వాహనాలను  పోలీసులు తనిఖీచేస్తున్నారు.  మధ్యాహ్నం 12 గం టల తర్వాత  ఒడిశాతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న ప్రయాణికుల వాహనాలను వెనక్కి పంపించేస్తున్నారు. అత్యవసర వాహనాలను అనుమతి పత్రాలు చూపించిన తర్వాత ఆంధ్రాలోకి విడిచిపెడుతున్నారు. తనిఖీ కేంద్రం వద్ద  పట్టణ ఎస్‌ఐ సత్యనారాయణ, సీఐ వినోద్‌బాబు పరిశీలిస్తున్నారు.  పాలకొండ: పాలకొండలో నిబంధనలు ఉల్లం ఘించిన పలు వాహనాల యజమానులకు పోలీసులు  మంగళవారం జరి మానా విధిం చారు ఈ సందర్భంగా  ఎస్‌ఐ ప్రసాద్‌ మాట్లా డుతూ నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలను సీజ్‌ చేస్తామని తెలిపారు. కాగా నగర పంచాయతీలోని పలు కూడళ్లలో పోలీసులు ప్లకార్డులతో ప్రజలకు అవగాహన కల్పించారు. 


 

Updated Date - 2021-05-12T05:13:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising