ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్యాలయాల్లో కలవరం!

ABN, First Publish Date - 2021-05-28T05:34:27+05:30

ప్రభుత్వ అధికారులు, సిబ్బంది కరోనా బారిన పడుతున్నారు. ఆస్పత్రులు, హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. దీంతో కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. కలెక్టరేట్‌, జిల్లా పరిషత్‌, వైద్యఆరోగ్య శాఖ, శ్రీకాకుళం కార్పొరేషన్‌తో పాటు కీలక శాఖలు, విభాగాల కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది ఒక్కొక్కరికీ పాజిటివ్‌గా నిర్థారణ అవుతోంది. ఇందులో కొందరు మృత్యువాత పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే కార్యాలయాల్లో సేవలు నిలిచిపోయాయి. ఆన్‌లైన్‌ సేవలే కొనసాగుతున్నాయి. ఇప్పుడు అధికారులు, సిబ్బంది గైర్హాజరుతో ఆ పనులు సైతం నిలిచిపోతున్నాయి. మం

సిబ్బంది రాక శ్రీకాకుళం కార్పొరేషన్‌ కార్యాలయంలో ఖాళీగా కుర్చీలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50




కరోనాబారిన అధికారులు, సిబ్బంది

పాలనాపరమైన పనుల్లో జాప్యం


(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వ అధికారులు, సిబ్బంది కరోనా బారిన పడుతున్నారు. ఆస్పత్రులు, హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. దీంతో కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. కలెక్టరేట్‌, జిల్లా పరిషత్‌, వైద్యఆరోగ్య శాఖ, శ్రీకాకుళం కార్పొరేషన్‌తో పాటు కీలక శాఖలు, విభాగాల కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది ఒక్కొక్కరికీ పాజిటివ్‌గా నిర్థారణ అవుతోంది. ఇందులో కొందరు మృత్యువాత పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే కార్యాలయాల్లో సేవలు నిలిచిపోయాయి. ఆన్‌లైన్‌ సేవలే కొనసాగుతున్నాయి. ఇప్పుడు అధికారులు, సిబ్బంది గైర్హాజరుతో ఆ పనులు సైతం నిలిచిపోతున్నాయి. మండల కార్యాలయాల్లో సైతం ఇదే పరిస్థితి. కేసులు పెరుగుతుండడంతో ఉద్యోగులు, సిబ్బంది కార్యాలయాలకు రావడానికి భయపడుతున్నారు.

- పలాసలో ఏపీ ట్రాన్స్‌కో రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న అసిస్టెంట్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ కరోనాతో మృతి చెందారు. అదే కార్యాలయంలో సిబ్బందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. 

- పలాసలోని ఓ బ్యాంకులో సెక్యూరిటీ గార్డు ఒకరు మృత్యువాత పడ్డారు.

- పలాస తహసీల్దారు కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బందికి పాజిటివ్‌ రావడంతో హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.

- జలుమూరు, ఎల్‌ఎన్‌ పేట మండలాల్లో విద్యుత్‌ లైన్‌మెన్లు కరోనాతో చనిపోయారు. కొందరు కోలుకున్నారు. 

-పాలకొండ ఆర్డీఓ కార్యాలయంలో సిబ్బందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. పోలీసు శాఖలో కూడా పలువురు కరోనా బారినపడ్డారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.

-రాజాం సబ్‌ రిజసా్ట్రర్‌ కార్యాలయంలో పలువురు సిబ్బందికి పాజిటివ్‌ వచ్చింది. కొందరు కోలుకున్నారు. ఇంకా కొందరు హోం ఐసోలేషన్‌లోనే ఉన్నారు.

 సందర్శకులు తగ్గుముఖం

కార్యాలయాల్లో పనిచేస్తున్న వారికి కరోనా సోకుతుండడంతో శాఖాపరమైన పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. సందర్శకుల సంఖ్య కూడా తగ్గుముఖం పడుతోంది. ఎక్కువ మంది ఫోన్‌లోనే అధికారులను ఆశ్రయిస్తున్నారు. కలెక్టర్‌ కార్యాలయం వద్ద ప్రత్యేక పోలీసు పోస్టును ఏర్పాటు చేసి లోపలికి ప్రవేశించకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో వివిధ విభాగాల్లో సిబ్బంది మహమ్మారి బారిన పడుతుండడంతో మిగిలిన సిబ్బంది మానసిక ఆందోళన చెందుతున్నారు. సిబ్బంది విధులకు రాకపోవడంతో జిల్లా కేంద్రంతో పాటు మండలాల్లో కార్యాలయాలు నిర్మానుష్యంగా మారుతున్నాయి. 

 కొవిడ్‌ వారియర్స్‌కూ...

కరోనా నియంత్రణకు ప్రంట్‌లైన్‌ వారియర్స్‌గా పేర్కొంటున్న వైద్యులు, వైద్యశాఖ క్షేత్రస్థాయి సిబ్బంది, పోలీసులు, శానిటేషన్‌ సిబ్బంది కూడా కరోనా బారిన పడుతున్నారు. రోజుల తరబడి ఇళ్లకే పరిమితమవుతున్నారు. వైద్య సిబ్బందికి రోజు తప్పించి రోజు విధులకు అవకాశం కల్పించినా పలువురు దీర్ఘకాలిక సెలవులోనే ఉంటున్నారు. ఎన్ని జాగ్రత్తలు పాటించినా మహమ్మారి పట్టి పీడిస్తుండడంతో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ కూడా భయంతో విధులు నిర్వహిస్తున్నారు.





11111111111111111111111111111111111111

Updated Date - 2021-05-28T05:34:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising