అక్రమ నిర్మాణాలు కూల్చివేత
ABN, First Publish Date - 2021-08-25T05:40:43+05:30
అక్రమ నిర్మాణాలు కూల్చివేత
మహాలక్ష్మినగర్ కాలనీలో అక్రమ నిర్మాణాలు తొలగిస్తున్న దృశ్యం
శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, ఆగస్టు 24: నిబంధనలు అతిక్ర మించిన భవనాలపై ఏడాదిన్నర తర్వాత అధికార యంత్రాం గం చర్యలు తీసుకుంది. శ్రీకాకుళం నగర పాలక సంస్థ పరిఽ దిలో ఆర్ట్స్‌కళాశాల రోడ్డు, మహాలక్ష్మినగర్ కాలనీ, కలెక్టర్ బం గ్లాదరి, కత్తెరవీధి, మంగువారితోట ప్రాంతాల్లో అక్రమ నిర్మా ణాలు ఉన్నట్లు 2020 ఫిబ్రవరిలో ఏసీబీ అఽధికారులు తేల్చారు. ఇప్పటికి నగరపాలక సంస్థ అధికారులు ఈ ఆక్రమ నిర్మా ణాలపై కదిలారు. మంగళవారం ఆర్ట్స్ కళాశాల రోడ్డు, మహా లక్ష్మినగర్ కాలనీలోని అక్రమ భవనాల శ్లాబులు, సెల్లార్లను కూల్చివేశారు. బుధవారం కత్తెరవీధి, మంగువారితోట, కలెక్టర్ బంగ్లాదరిలోని అక్రమ నిర్మాణాలను తొలగించనున్నారు.
Updated Date - 2021-08-25T05:40:43+05:30 IST