ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మడుగులో మృత్యువు

ABN, First Publish Date - 2021-07-31T05:17:45+05:30

బొడ్డగూడ పంచాయతీ పరిధిలోని తివ్వకొండ శిఖరంలో ఉన్న కోటకొండ గ్రామంలో ఇద్దరి గిరిజన బాలికలు గుంతలో పడి ప్రాణాలు కోల్పోయారు.

మృతదేహాల వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంతలో దిగిన విద్యార్థినులు

బురదలో కూరుకుపోయి మృతి

కోటకొండలో విషాదం

భామిని, జూలై 30: బొడ్డగూడ పంచాయతీ పరిధిలోని తివ్వకొండ శిఖరంలో  ఉన్న కోటకొండ  గ్రామంలో ఇద్దరి గిరిజన బాలికలు గుంతలో పడి ప్రాణాలు కోల్పోయారు. గ్రామస్థుల కథ నం మేరకు.. కోటకొండ  గ్రామానికి చెందిన స్నేహితులు పాలక కీర్తి(13), ఆరిక అంజిలి(13) శుక్రవారం మధ్యాహ్నం బావి వద్దకు స్నానానికి వెళ్లారు. బావి పక్కనే ఉన్న గుంతలో దిగారు. అక్కడ లోతు ఎక్కువగా ఉండడంతో ఇద్దరూ బురదలో కూరుకుపో యారు. వారితో వెళ్లిన మరో బాలిక గ్రామంలోకి వచ్చి సమాచా రం తెలియజేసింది. గ్రామస్థులు సంఘటన స్థలానికి చేరుకొని గుంతలో దిగి బయటకు తీసేసరికే వారిద్దరూ మృతి చెందారు. గ్రామపెద్దల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ బి.అనీల్‌కుమార్‌ ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. శనివారం పాలకొండ ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను తరలిస్తామని చెప్పారు. కీర్తి, అంజలి విజయనగరం జిల్లా ఉదయపురం రెసిడెన్షి యల్‌ పాఠశాలలో ఏడో తరగతి పూర్తిచేశారు. కరోనా వల్ల పాఠశాలలు మూతపడడంతో ఇంటి వద్దనే ఉంటున్నారు. ఆరిక అంజిలి తండ్రి గురుము, తల్లి గంగ, పాలక కీర్తి తండ్రి అప్పన్న, తల్లి మౌసమిలు వ్యవసాయ పనులు చేసుకొని జీవిస్తున్నారు. కుమార్తెల మృతితో ఆ రెండు కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. 

Updated Date - 2021-07-31T05:17:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising