ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీపీఎస్‌ను రద్దు చేయాలి

ABN, First Publish Date - 2021-07-24T04:47:31+05:30

సీపీఎస్‌ను రద్దు చేయాలి

శ్రీకాకుళం తహశీల్దారు కార్యాలయం వద్ద ఫ్యాప్టో ఆద్వర్యంలో నిర్వహించిన ఉపాధ్యాయుల నిరసన ప్రదర్శనలో మాట్లాడుతున్న ప్రతినిదులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- డీఏ బకాయిలు చెల్లించాలి 

- ఉపాధ్యాయుల నిరసన

గుజరాతీపేట, జూలై 23: పాదయాత్ర సమయంలో సీఎం జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ను అమలు చేయాలని ఉపాధ్యాయులు డిమాండ్‌ చేశారు. తమ సమస్యలపై  శుక్రవారం  శ్రీకా కుళం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఫ్యాప్టో ఆధ్వర్యంలో  నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ  సంఘ నాయకులు మాట్లాడుతూ, పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను వెంటనే చెల్లించాలన్నారు. విద్యాశాఖలో అన్ని యాజమాన్యాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో పదోన్నతుల కోసం షెడ్యూల్‌ విడుదల చేయాలని కోరారు. నూతన విద్యా విధా నంపై స్పష్టతనివ్వాలని.. 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలలకు తరలించొద్దని కోరారు. మృతిచెందిన ఉపాధ్యా యుల కుటుంబ సభ్యులకు గ్రీన్‌ఛానల్‌ ద్వారా కారుణ్య నియా మకాలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఏపీజీఎల్‌ఐ, పీఎఫ్‌ లోన్లు, ప్రతి నెలా జీతాలు, పెన్షన్లు సకాలంలో చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు పురుషోత్తంనాయుడు, జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాం, ప్రధాన కార్యదర్శి చల్లా శ్రీనివాస్‌,  యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి చౌదరి రవీంద్ర, హెచ్‌ఎం అసోసియేషన్‌ అధ్యక్షుడు దాలినాయుడు,  డీటీఎఫ్‌, పీఈటీ, ఏపీటీఎఫ్‌, పెన్షనర్స్‌ సంఘ నాయకులు పాల్గొన్నారు.


Updated Date - 2021-07-24T04:47:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising