ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మృత్యువుతో పోరాడి...

ABN, First Publish Date - 2021-03-09T06:28:47+05:30

మూడు రోజులుగా మృత్యువుతో పోరాడిన భవన నిర్మాణ కార్మికుడు చల్ల శ్రీనివాసరావు (32) సోమవారం మృతిచెందాడు. నరస న్నపేట బొంతలవీధిలో బహుళ అంతస్తుల భవన నిర్మా ణ పనులు చేస్తుండగా శ్రీనివాసరావు విద్యుత్‌ ప్రమాదా నికి గురై అపస్మారకస్థితికి చేరుకున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విద్యుదాఘాతానికి గురైన భవన నిర్మాణ కార్మికుడి మృతి

నరసన్నపేట, మార్చి 8 : మూడు రోజులుగా మృత్యువుతో పోరాడిన భవన నిర్మాణ కార్మికుడు చల్ల శ్రీనివాసరావు (32) సోమవారం మృతిచెందాడు. నరస న్నపేట బొంతలవీధిలో బహుళ అంతస్తుల భవన నిర్మా ణ పనులు చేస్తుండగా శ్రీనివాసరావు విద్యుత్‌ ప్రమాదా నికి గురై అపస్మారకస్థితికి చేరుకున్నాడు. ముందుగా శ్రీకాకుళం రిమ్స్‌లో చేర్పించగా.. పరిస్థితి విషమంగా మారడంతో అక్కడి వైద్యులు కేజీహెచ్‌కు రిఫర్‌ చేశారు. రెండు రోజులుగా అక్కడ చికిత్సపొందుతూ అతను కన్నుమూశాడు. కాగా శ్రీనివా సరావుకి భార్య అనసూయ, కుమారుడుతో పాటు వృద్ధ తల్లిదండ్రులు సూరప్పడు, చిట్టెమ్మ ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ-2 ప్రసాదరావు తెలిపారు. అనుమతులు లేకుండా భవన నిర్మాణాలు చేపడుతుండడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు భావిస్తున్నారు. భవన నిర్మాణం చేపడుతున్న వ్యక్తికి విద్యుత్‌ శాఖ నోటీసులు జారీ చేసినా పనుల్లో రక్షణ చర్యలు చేపట్టలేదని అధికారులు గుర్తించారు. శ్రీనివాసరావు కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని సీఐటీయూ నాయకుడు చలపతిరావు డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2021-03-09T06:28:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising