ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గందరగోళం!

ABN, First Publish Date - 2021-04-24T05:14:12+05:30

కరోనా నిర్థారణ పరీక్షల ఫలితాల్లో గందరగోళం నెలకొంటుంది. ఒకే పరీక్షకు రెండు ఫలితాలు వస్తున్నాయి. దీంతో బాధితుల్లో ఆందోళన వ్యక్తమవుతుండగా.. అధికారుల నుంచి కచ్చితమైన సమాచారం రావడం లేదు. పలాసలో రైల్వే ఉద్యోగి భార్యకు జ్వరం రావడంతో నిర్థారణ పరీక్షలు చేయించుకున్నారు. ఆయనకు పాజిటివ్‌ అని తేలడంతో హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఆ మరుసటి రోజు నెగిటివ్‌ అని సమాచారం రావడంతో సంబంధిత అధికారులకు సంప్రదించాడు. అయితే వారు కచ్చితమైన సమాచారం ఇవ్వడం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50




ఒక పరీక్ష...రెండు ఫలితాలు

పలాస, ఏప్రిల్‌ 23: కరోనా నిర్థారణ పరీక్షల ఫలితాల్లో గందరగోళం నెలకొంటుంది. ఒకే పరీక్షకు రెండు ఫలితాలు వస్తున్నాయి. దీంతో బాధితుల్లో ఆందోళన వ్యక్తమవుతుండగా.. అధికారుల నుంచి కచ్చితమైన సమాచారం రావడం లేదు. పలాసలో రైల్వే ఉద్యోగి భార్యకు జ్వరం రావడంతో నిర్థారణ పరీక్షలు చేయించుకున్నారు. ఆయనకు పాజిటివ్‌ అని తేలడంతో హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఆ మరుసటి రోజు నెగిటివ్‌ అని సమాచారం రావడంతో సంబంధిత అధికారులకు సంప్రదించాడు. అయితే వారు కచ్చితమైన సమాచారం ఇవ్వడం లేదు. అయితే ఆయనకు ప్రస్తుతం కొవిడ్‌ ఉందా, లేదా అనేది నిద్ధారణ కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. అయితే పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లో అనేక మందికి ఇదే పరిస్థితి ఎదురవుతోంది. ఒక సారి పాజిటివ్‌ అని, మరోమారు నెగిటివ్‌ అని సమాచారం వస్తుండడంతో అయోమయ పరిస్థితి నెలకొంటుంది. పలాస ప్రభుత్వాసుపత్రిలో ప్రతిరోజూ వంద నుంచి 150 మందికి నిర్థారణ పరీక్షలు చేస్తున్నారు. 48 గంటల తరువాత ఫలితాలు ఫోన్‌ద్వారా వస్తున్నాయి. దీంతో అప్రమత్తమై వ్యాధి లక్షణాల బట్టి క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. కొందర్ని హోమ్‌ క్వారంటైన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కానీ ఫలితాల వెల్లడిలో గందరగోళం నెలకొంటోంది. 



Updated Date - 2021-04-24T05:14:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising