ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొని

ABN, First Publish Date - 2021-01-27T05:58:22+05:30

యాలతో బయటపడ్డారు. ఎస్‌ఐ శంకరరావు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మంటల్లో కాలిపోతున్న వ్యాన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50




వ్యాన్‌కు వ్యాపించిన మంటలు
గంట వ్యవధిలోనే కాలి బూడిద
నాలుగు టన్నుల చేపలు ధ్వంసం
రూ.20 లక్షల ఆస్తి నష్టం
పలాస, జనవరి 26 :

తెల్లవారుజాము సమయమది. విపరీతమైన పొగ మంచు కురుస్తోంది. పలాస సమీపంలో కోసంగిపురం వద్ద విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టి ఓ వ్యాన్‌ బోల్తా పడింది. క్షణాల్లో మంటలు వ్యాపించగా..గంట వ్యవధిలోనే పూర్తిగా కాలిపోయింది. అందులో ఉన్న నాలుగు టన్నుల చేపలు పూర్తిగా ధ్వంసమవ్వగా.. రూ.20 లక్షల ఆస్తి నష్టం సంభవించింది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
అకివీడు నుంచి కటక్‌కు చేపల లోడుతో వ్యాన్‌ వెళ్తోంది. మంగళవారం వేకువజామున కోసంగిపురం జంక్షన్‌కు వచ్చేసరికి  అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టి బోల్తా పడింది. వ్యాన్‌ ఇంజన్‌లో మంటలు వ్యాపించాయి. గంట వ్యవధిలోనే పూర్తిగా వ్యాన్‌ కాలిపోయింది. కాశీబుగ్గ అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికి కాలి బూడిదయ్యింది. చెల్లాచెదురుగా పడిన చేపలను స్థానికులు తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించి రూ.20 లక్షల ఆస్తినష్టం జరిగినట్టు అంచనా. వ్యాన్‌ బోల్తాపడిన వెంటనే అప్రమత్తమైన డ్రైవర్‌, క్లీనర్‌ స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఎస్‌ఐ శంకరరావు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.




Updated Date - 2021-01-27T05:58:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising