ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొందరికే చెక్‌ పవర్‌!

ABN, First Publish Date - 2021-06-18T05:12:05+05:30

ఎట్టకేలకు సర్పంచ్‌లకు చెక్‌ పవర్‌ లభించింది. ప్రస్తుతానికి 896 మందికే చెక్‌ పవర్‌ వచ్చినట్టు తెలుస్తోంది. మిగతా వారికి వివిధ కారణాలతో జాప్యమయ్యే అవకాశముంది. ఎన్నికలు జరిగి మూడు నెలలు గడుస్తోంది. కానీ చెక్‌పవర్‌ లేక ప్రధాన సమస్యలకు మోక్షం కలగడం లేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50




 896 మంది సర్పంచ్‌లకు మాత్రమే అవకాశం

 మిగతా వారికి మరింత జాప్యం

 కసరత్తు చేస్తున్న అధికారులు

(ఇచ్ఛాపురం రూరల్‌)

ఎట్టకేలకు సర్పంచ్‌లకు చెక్‌ పవర్‌ లభించింది. ప్రస్తుతానికి 896 మందికే చెక్‌ పవర్‌ వచ్చినట్టు తెలుస్తోంది. మిగతా వారికి వివిధ కారణాలతో జాప్యమయ్యే అవకాశముంది. ఎన్నికలు జరిగి మూడు నెలలు గడుస్తోంది. కానీ చెక్‌పవర్‌ లేక ప్రధాన సమస్యలకు మోక్షం కలగడం లేదు. ప్రధానంగా 15వ ఆర్థిక సంఘం నిధులు ఖర్చు పెట్టలేని పరిస్థితి నెలకొంది. కరోనా సెకెండ్‌ వేవ్‌ ఉధృతి కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో గ్రామాల్లో పారిశుధ్య పనులు చురుగ్గా చేపట్టాలి. చెక్‌ పవర్‌ లేకపోవడంతో అనేకచోట్ల సర్పంచ్‌లే సొంత నిధులు ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. ప్రత్యేకాధికారుల పేర్లు సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్‌ఎంఎస్‌) నుంచి తొలగించారు. వారి స్థానంలో సర్పంచ్‌లకు ఐడీలు సృష్టించి ఖజానాకు నివేదించాలి. కాంట్రాక్టర్లుగా ఉన్న కొందరు సర్పంచులుగా ఎన్నికయ్యారు. వారికి ఇంతకు ముందే గుర్తింపు నెంబరు ఉంటుంది. ఆ నెంబరును రద్ధుచేసి కొత్త ఐడీ నెంబరు సృష్టించడంలో ఆలస్యం జరుగుతోంది. 


ఇదీ పరిస్థితి

జిల్లాలో మొత్తం 1,190 పంచాయతీలకుగాను... 1,164 పంచాయతీలకు ఎన్ని కలు జరిగాయి. అందులో గురువారం నాటికి 896 మంది సర్పంచ్‌లకు చెక్‌ డ్రాయింగ్‌ పవర్‌ కల్పించారు. ఇంకా 268 మందికి వివిధ కారణాలతో లభించ లేదు.  268 మందిలో 106 మంది సర్పంచ్‌లకు ట్రెజరీలో ఎస్‌టీవో నుంచి అనుమతులు రావాల్సి ఉంది. 138 మందికి వెండర్‌ కోడ్‌ రావడం లేదు (వివిధ పనుల్లో కాంట్రాక్టర్లుగా ఉన్నందున). 16 పంచాయతీలకు పొజిషన్‌ యాడింగ్‌ లేదు. జిల్లావ్యాప్తంగా 8 మంది సర్పంచ్‌లు మృతి చెందారు. వీరికి సంబంధిం చి గుర్తింపు నంబర్లు వచ్చేటప్పటికీ మరింత జాప్యం జరిగే అవకాశం ఉంది. దీనిపై ఎంపీడీవోలు, పంచాయతీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. 


వారం రోజుల్లో అందరికీ..

 జిల్లాలోని సర్పంచులందరికీ మరో వారం రోజుల్లో చెక్‌పవర్‌ అందించేందుకు కృషి చేస్తున్నాం. ఎంపీడీవోలు, ఈవోపీఆర్డీలు వాటిపై పూర్తి కసరత్తు చేస్తున్నారు. ఎన్నికైన వారిలో కొందరు కాంట్రాక్టర్లు ఉండడం, మరికొన్ని పంచాయతీల్లో ప్రత్యేకాధికారి ఐడీ నెంబరు మారకపోవడం వల్ల ఆలస్యం జరుగుతోంది. ఎన్నికైన సర్పంచులందరికీ చెక్‌పవర్‌ అందిస్తాం. 

-రవికుమార్‌, డీపీవో, శ్రీకాకుళం.


1111111111111111111111111111111

Updated Date - 2021-06-18T05:12:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising