ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పనితీరు మార్చుకోండి

ABN, First Publish Date - 2021-07-25T04:44:22+05:30

పనితీరు మార్చుకోండి

యలమంచిలిలో గ్రామ వలంటీర్లుతో మాట్లాడుతున్న జేసీ శ్రీనివాసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- జేసీ శ్రీనివాసులు హెచ్చరిక

- జలుమూరు ఎంపీడీవోతో పాటు ముగ్గురు సచివాలయ సిబ్బందికి మెమోలు

జలుమూరు, జూలై 24: ‘పనితీరు మార్చుకోండి. లేకపోతే విధుల నుంచి తొలగిస్తా’మంటూ జేసీ శ్రీనివాసులు సచివాలయ సిబ్బందికి హెచ్చరించారు. జలుమూరు మండలంలోని యలమంచిలి, సైరిగాం గ్రామ సచివాలయాలను శనివారం ఆకస్మికంగా ఆయన తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ముగ్గురి సిబ్బందికి, ఎంపీడీవోకు మెమోలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో జలుమూరు, మెళియాపుట్టి, జి.సిగడాం మండలాల సచివాలయ సిబ్బంది పనితీరు దారుణంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యవేక్షణ లోపం కారణంగా యలమంచిలి సచివాలయ సిబ్బంది పనితీరు బాగోలేదన్నారు. దీనికి బాధ్యులైన ఎంపీడీవో ఎ.దామోదరరావుకు మెమో జారీ చేశామన్నారు. అలాగే బయోమెట్రిక్‌ వేయని కారణంగా వీఆర్వో సింహాచలానికి,  కంప్యూటర్‌ పని చేయకపోవడంతో పంచాయతీ కార్యదర్శి జయబాబుకు, అప్పటికప్పుడు సెలవు దరఖాస్తు ఇచ్చి.. విధులకు గైర్హాజరైన కొండపోలవలస పంచాయతీ కార్యదర్శికి మెమోలు జారీ చేశామని తెలిపారు. సిబ్బంది పనితీరు మార్చుకోకపోతే విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. సైరిగాంలో సంక్షేమ పథకాల లబ్ధిదారుల పేర్లు ఇంగ్లీషులో పెట్టినందుకు ఆక్షేపించారు. తప్పనిసరిగా లబ్ధిదారుల పేర్లు తెలుగులోనే ఉండాలని సూచించారు. ఈ పరిశీలనలో ఎంపీడీవో ఎ.దామోదరరావు, యలమంచిలి సర్పంచ్‌ మెండ రవి, సచివాలయాల సిబ్బంది పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-07-25T04:44:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising