బీఎస్‌ఎఫ్ జవాన్ ఆత్మహత్య
ABN, First Publish Date - 2021-07-29T05:28:23+05:30
పట్టణంలోని మెట్టక్కివలస మానుకొండ వీధికి చెందిన బీఎస్‌ఎఫ్ జవాను తోటపాకల సుధీర్‌కుమార్(40) బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం మేరకు... పంజాబ్‌లోని బీఎస్‌ఎఫ్ 116 బెటాలియన్‌లో సుధీర్‌కుమార్ పనిచేస్తున్నాడు.
ఆమదాలవలస: పట్టణంలోని మెట్టక్కివలస మానుకొండ వీధికి చెందిన బీఎస్‌ఎఫ్ జవాను తోటపాకల సుధీర్‌కుమార్(40) బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం మేరకు... పంజాబ్‌లోని బీఎస్‌ఎఫ్ 116 బెటాలియన్‌లో సుధీర్‌కుమార్ పనిచేస్తున్నాడు. శ్రీకాకుళం రూరల్ మండలంలోని బైరవానిపేటకు చెందిన రాజేశ్వరితో 15 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఐదు రోజుల కిందట సెలవుపై ఇంటికి వచ్చాడు. భార్యాభర్తల మధ్య కొంతకాలంగా మనస్పర్థలు చోటుచేసుకోవడంతో ఆమె కన్నవారి ఇంటికి వెళ్లిపోయింది. సుధీర్‌కుమార్‌పై భార్య రాజేశ్వరి శ్రీకాకుళం దిశ పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టింది. తల్లిదండ్రులతో కలిసిఉంటున్న సుధీర్‌కుమార్ బుధవారం పక్కగదిలో ఫ్యాన్‌కు ఉరిపోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మధ్యాహ్నం తల్లిదండ్రులు పక్కగదిలో పరిశీలించగా సుధీర్‌కుమార్ విగతజీవిగా పడిఉన్నాడు. కుటుంబసభ్యుల సమాచారంతో ఎస్‌ఐ ఎ.కోటేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2021-07-29T05:28:23+05:30 IST