ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి ఆలయాల్లో దర్శనాలకు బ్రేక్‌

ABN, First Publish Date - 2021-04-23T05:25:09+05:30

కరోనా ప్రభావం దృష్ట్యా ఆలయాల్లో దర్శనాలకు బ్రేక్‌ పడిం ది. కలెక్టర్‌ నివాస్‌ ఆదేశాల మేరకు అరసవల్లి సూర్యనారాయణ స్వామి దర్శనాలను నేటి (శుక్ర వారం) నుంచి మే 10 వరకు నిలిపివేస్తున్నట్టు ఈవో హరిసూర్యప్రకాష్‌ ఒక ప్రకటనలో పేర్కొ న్నారు. దేవాలయం చుట్టుపక్కల కొవిడ్‌ వ్యాప్తి ఉధృతంగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కేశఖండనశాల, ప్రసాదాల కౌంటర్లు, అన్నదాన సత్రంను కూడా మూసివేస్తున్నట్లు తెలిపారు.

శ్రీముఖలింగేశ్వరాలయాన్ని మూసివేస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 అరసవల్లి, శ్రీముఖలింగం దేవాలయాల్లో భక్తులకు అనుమతి లేదు

గుజరాతీపేట/జలుమూరు, ఏప్రిల్‌ 22: కరోనా ప్రభావం దృష్ట్యా ఆలయాల్లో దర్శనాలకు బ్రేక్‌ పడిం ది. కలెక్టర్‌ నివాస్‌ ఆదేశాల మేరకు అరసవల్లి సూర్యనారాయణ స్వామి దర్శనాలను నేటి (శుక్ర వారం) నుంచి మే 10 వరకు నిలిపివేస్తున్నట్టు ఈవో హరిసూర్యప్రకాష్‌ ఒక ప్రకటనలో పేర్కొ న్నారు. దేవాలయం చుట్టుపక్కల కొవిడ్‌ వ్యాప్తి ఉధృతంగా ఉండడంతో  ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కేశఖండనశాల, ప్రసాదాల కౌంటర్లు, అన్నదాన సత్రంను కూడా మూసివేస్తున్నట్లు తెలిపారు. స్వామివారి నిత్యపూజలు, వార్షిక కల్యాణో త్సవాలు యధావిధిగా జరు గుతాయని ప్రధానార్చకుడు ఇప్పిలి శంకరశర్మ తెలిపారు. భక్తులు సహకరించాలని కోరారు. జలుమూరు మండలం శ్రీముఖలింగంలోని శ్రీముఖలింగేశ్వరుడి ఆలయంలో కూడా దర్శనాలు తాత్కాలికంగా నిలిపివేశామని ఆలయ ఈవో ఎన్‌.వి.రమణయ్య తెలిపారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా గురు వారం సాయంత్రం నుంచి ఆలయాన్ని మూసివేశామని ప్రకటించారు. స్వామివారికి  దూప దీప నైవేద్య కైంకర్యా లు యథావిధిగా జరుగుతాయన్నారు. కొద్దిరోజులు భక్తు లకు మాత్రం ఆలయం లోపలికి అనుమతి లేదని.. ఈ విషయాన్ని గ్రహించి సహకరించాలని కోరారు.  

Updated Date - 2021-04-23T05:25:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising