ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రక్తదాతలు స్ఫూర్తి ప్రదాతలు..!

ABN, First Publish Date - 2021-02-27T05:15:27+05:30

రక్తదాతలు స్ఫూర్తిప్రదాతలుగా నిలుస్తారని రెడ్‌క్రాస్‌ రాష్ట్ర వైస్‌చైర్మన్‌ పోలుమహంతి జగన్మోహనరావు అన్నారు. శుక్రవారం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సబ్‌ రిజిస్ట్రార్‌ బలగ గీతాలక్ష్మి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.

రక్తదాతలను అభినందిస్తున్న జగన్మోహనరావు తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రెడ్‌క్రాస్‌ వైస్‌ చైర్మన్‌ జగన్మోహన్‌రావు

రాజాం, ఫిబ్రవరి 26: రక్తదాతలు స్ఫూర్తిప్రదాతలుగా నిలుస్తారని రెడ్‌క్రాస్‌ రాష్ట్ర వైస్‌చైర్మన్‌ పోలుమహంతి జగన్మోహనరావు అన్నారు. శుక్రవారం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సబ్‌ రిజిస్ట్రార్‌ బలగ గీతాలక్ష్మి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ శిబిరంలో 101 మంది రక్తదానం చేయడం అభినందనీయన్నారు. జిల్లాలో రాజాం ప్రాంతం నుంచి అధిక సంఖ్యలో రక్తదాతలు ముందుకు వస్తున్నారని, కొవిడ్‌ సమయంలో జిల్లా వ్యాప్తంగా 250 మంది ప్లాస్మాదానం చేస్తే.. వారిలో రాజాం నుంచి 60 మంది ఉన్నారన్నారు. సబ్‌ రిజిస్ట్రార్‌ గీతాలక్ష్మి కూడా ప్లాస్మాదానం చేసిన మొదటి వ్యక్తి కావడం అభినందనీయమన్నారు. ఇదే స్ఫూర్తితో రక్తదానానికి యువత ముందుకు రావాలని కోరారు. అనంతరం రక్తదాతలకు ప్రశంసాపత్రాలు అందించారు.  అనంతరం కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో రాజాం రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ కొత్తా సాయిప్రశాంత్‌కుమార్‌, పెంకి చైతన్యకుమార్‌, నగరపంచాయితీ కమిషనర్‌ ఎన్‌.రమేష్‌, పట్టణ సీఐ పి.శ్రీనివాసరావు, వికాస తరంగణి జిల్లా అధ్యక్షుడు టీటీవీ రమణ మూర్తి,  డాక్టర్‌ గార రవిప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.  

 


 

Updated Date - 2021-02-27T05:15:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising