ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నవంబరు 1 నుంచి పీహెచ్‌సీల్లో బయోమెట్రిక్‌

ABN, First Publish Date - 2021-10-15T04:17:09+05:30

రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నవంబరు 1 నుంచి బయోమెట్రిక్‌ హాజరును అమలు చేయాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటంనేని భాస్కర్‌ ఆదేశించా రు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అమలవుతున్న కార్యక్రమాలపై జిల్లా అధికారులతో గురువారం ఆయన వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, అక్టోబరు 14: రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నవంబరు 1 నుంచి బయోమెట్రిక్‌ హాజరును అమలు చేయాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటంనేని భాస్కర్‌ ఆదేశించా రు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అమలవుతున్న కార్యక్రమాలపై జిల్లా అధికారులతో గురువారం ఆయన వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీహెచ్‌సీ సిబ్బంది విధులకు వచ్చినప్పుడు.. తిరిగి వెళ్లినప్పుడు తప్పనిసరిగా బయోమెట్రిక్‌ వేయాల్సిందే స్పష్టం చేశారు. బ యోమెట్రిక్‌ పరికరాలు లేని పీహెచ్‌సీల్లో తక్షణమే కొనుగోలు చేయాలన్నారు. విధులకు హాజరుకాని సిబ్బందికి జీతం చెల్లించమన్నారు. ప్రైవేట్‌ ఆసుపత్రులకు దీటుగా సేవలందించాలని ఆదేశించారు. అర్హతలు, అనుభవం కలిగినవారే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉంటారన్న విషయాన్ని అందరూ గ్రహించాలన్నారు.  పీహెచ్‌సీల్లో ప్రసవాలు తక్కువగా జరుగుతున్నాయని.. ఈ పరిస్థితి మారాలన్నారు. మాతాశిశు మరణాలు సంభవించకూడదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో చంద్రనాయక్‌,  ఏడీఎంహెచ్‌వో జగన్నాథరావు, తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-10-15T04:17:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising