ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నారాయణపురం కుడికాలువ ఆధునికీకరణతో ప్రయోజనం

ABN, First Publish Date - 2021-03-04T05:39:29+05:30

నారాయణపురం ప్రాజెక్టు కుడిప్రధాన కాలువను ఆధునికీకరించడం వల్ల ఎక్కువమంది రైతులకు ప్రయోజనం కలుగుతుందని స్పీకర్‌ తమ్మినేని సీతారాం తెలిపారు.

మాట్లాడుతున్న సీతారాం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 స్పీకర్‌ తమ్మినేని సీతారాం

పొందూరు: నారాయణపురం ప్రాజెక్టు కుడిప్రధాన కాలువను ఆధునికీకరించడం వల్ల ఎక్కువమంది రైతులకు ప్రయోజనం కలుగుతుందని  స్పీకర్‌ తమ్మినేని సీతారాం తెలిపారు.బుధవారం గోకర్ణపల్లి వద్ద రూ.38.71 కోట్ల జైకా నిధులతో జరుగుతున్న నారాయణపురం కుడికాలువ ఆధుని కీకరణ పను లను  పరిశీలించారు. ఈ సందర్భంగా  గోకర్ణపల్లి సర్పంచ్‌ చింతాడ మాధురి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడుతూ  రూ.38 కోట్లతో పొం దూరు, సంతకవిటి, ఎచ్చెర్ల మండలాల్లో 50.6 కిలోమీటర్ల కాలువను మరమ్మతు చేయడం వల్ల 18,362 ఎకరాలకు నీరందుతుందని తెలిపారు.  నారాయణపురం ప్రాజెక్టుకు కృషిచేసిన  తమ్మినేని పాపారావు పేరును ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినా బోర్డు ఏర్పాటుచేయడానికి అధికారులు నిర్లక్ష్యం చూపడంపై స్పీకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశా రు.  కార్యక్రమంలో ఇరిగేషన్‌ ఎస్‌ఈ రమణ, వైసీపీ రాష్ట్ర యువజన విభాగం ప్రధానకార్యదర్శి చిరంజీవి నాగ్‌, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు పప్పల రమ ణమూర్తి (మున్నా), ఎస్‌.గాంధీ  పాల్గొన్నారు.


 



Updated Date - 2021-03-04T05:39:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising