ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆటో బోల్తా...మహిళ మృతి

ABN, First Publish Date - 2021-01-16T05:41:01+05:30

జాతీయరహదారి పలాస బైపాస్‌ రోడ్డు పారసంబ వద్ద శుక్రవారం ఉదయం ఆటోబోల్తా పడడంతో బైనపల్లి లచ్చి(55) అక్కడికక్కడే మృతిచెందింది.

వెంకటరమణ (ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 


 ఐదుగురికి తీవ్ర గాయాలు

 చేపలు విక్రయించడానికి వెళ్తుండగా ప్రమాదం 

పలాస:జాతీయరహదారి పలాస బైపాస్‌ రోడ్డు పారసంబ  వద్ద శుక్రవారం ఉదయం ఆటోబోల్తా పడడంతో  బైనపల్లి లచ్చి(55)  అక్కడికక్కడే మృతిచెందింది. అందులో ప్రయాణి స్తున్న డ్రైవర్‌తోపాటు మరో నలుగురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు... వజ్రపుకొ త్తూరు మండలంలోని నువ్వలరేవు గ్రామానికి చెందిన లచ్చితోపాటు డ్రైవర్‌ బైనపల్లి భాస్కర్‌, బెహరా సావిత్రి, మువ్వల పార్వతి, ఎం.దమయంతి, డారిమో బైనపల్లిలు చేపలు విక్రయానికి  మెళియాపుట్టి మండలంలోని గొప్పిలి  ఆటోలో వెళ్తున్నారు.ఈ క్రమంలో జాతీయరహదారిపై వెళ్తుండగా పారసంబ  వద్ద రోడ్డుకు అడ్డంగా అడవిపందుల గుంపు రావడంతో దాన్ని తప్పించబోయి ఆటోపక్కకు తిప్పారు. దీంతో  అదుపు తప్పి బోల్తా పడింది.  అందులో ప్రయా ణిస్తున్న లచ్చి అక్కడే మృతిచెందగా మిగిలినవారికి తీవ్ర గాయాలయ్యాయి. కాశీబుగ్గ ఎస్‌ఐ శిరీష సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలు బాధితుల నుంచి అడిగి తెసుకున్నారు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


వెంకటరమణ (ఫైల్‌) : పలాస 7



Updated Date - 2021-01-16T05:41:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising