ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యాత్రికులు స్వస్థలాలకు చేరుకోవడానికి ఏర్పాట్లు

ABN, First Publish Date - 2021-11-26T05:19:10+05:30

సింధునది పుష్కరాలకు జిల్లా నుంచి వెళ్లిన యాత్రికులు స్వస్థలాలకు చేరుకోవడానికి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.

అమృతసర్‌లో ఓ హోటల్‌లో బస చేసిన పాలకొండ యాత్రికులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



పాలకొండ: సింధునది పుష్కరాలకు జిల్లా నుంచి వెళ్లిన యాత్రికులు స్వస్థలాలకు చేరుకోవడానికి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.జిల్లా నుంచి వెళ్లిన యాత్రి కులు ట్రావెల్‌ ఏజెంట్‌ చేతిలో మోసానికి గురైన విషయం విదితమే. ఈ నేపథ్యంలో  ఎంపీ రామ్మోహన్‌నాయుడు చొరవతో  బయటపడ్డారు. జిల్లా నుంచి 300 మంది యాత్రికులు ట్రావెల్స్‌ యాజమాన్యంతో ఒప్పందం కుదుర్చుకొని యాత్రకు వెళ్లారు. ట్రావెల్‌ యజమాని కాశ్మీర్‌లో వారి విడిచిపెట్టి పరారీకావడంతో  అవస్థలుపడిన విషయం విదితమే.అయితే 28వ తేదీకి సంబంధిత ట్రావెల్‌ యజమాని వంద మంది వరకు ఢిల్లీ నుంచి విశాఖపట్నానికి విమాన టిక్కెట్లను అందజేశారు. మిగిలిన వారికి టిక్కెట్లు రాకపోవడంతో వారు రైళ్లు, విమాన సర్వీసుల ద్వారా స్వగ్రామాలకు చేరేం దుకు ప్రయత్నాలు ముమ్మరంచేశారు. 28వ తేదీకి ఢిల్లీ నుంచి ప్రయాణం చేయాల్సిన వారంతా తమ సొంతఖర్చులతో యథావిఽధి యాత్రను కొనసాగిస్తున్నారు. గురువారం పాలకొండకు చెందిన 113 మంది యాత్రికులతోపాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన మరోకొంతమంది ట్రావెల్‌ యాజమాన్యంతో ఒప్పందం కుదుర్చుకొని 27వ తేదీ వరకు ఢిల్లీ వరకు యాత్ర చేసేందుకు ఏర్పాట్లుచేశారు. వీరితో కొంతమంది యాత్రకు శుక్రవారం నాటికి నేరుగా ఢిల్లీకి చేరినట్టు ఏర్పాటుచేయగా, మరికొంత మంది అమృతసర్‌ తదితర ప్రాంతాలను తిరిగి 28 నాటికి ఢిల్లీ చేరేందుకు  ఏర్పాట్లుచేశారు.యాత్ర సజావుగా సాగుతోందని,ఓట్రావెల్‌ యాజమాన్యంతో మాట్లా డామని, మోసంచేయడంతో ఆర్థికంగా ఇబ్బందిపడ్డామని యాత్రికులు తెలిపారు.    ప్రస్తుతం కొంతమంది అమృతసర్‌,ఢిల్లీ, శ్రీనగర్‌లో బసచేసినట్లు పాలకొండకు చెందిన యాత్రికులు నందానరమేష్‌, కాడ్రేగుల శ్రీనివాసరావు, గొర్లె శ్రీనివాసరావు   తెలిపారు. 


 

Updated Date - 2021-11-26T05:19:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising